close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

పూర్వ విద్యార్థుల సమ్మేళనం


ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు

నిజామాబాద్‌ సిటీ, న్యూస్‌టుడే: నగరంలోని సీఎస్‌ఐ హైస్కూల్‌కు చెందిన 1996-97 బ్యాచ్‌ పదోతరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం గూపన్‌పల్లిలోని ఓ కల్యాణ మంపడంలో ఆదివారం నిర్వహించారు. 23 ఏళ్ల తర్వాత ఒకరికొకరు కలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్సాహంగా గడిపారు. ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో తెలుసుకొన్నారు. కుటుంబసభ్యులను పరిచయం చేశారు. అనంతరం వారికి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు జీవన్‌, కేశవ్‌కుమార్‌, సుధీర్‌, దేవ్‌పాల్‌, పద్మ, స్వర్ణలతను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చంద్రశేఖర్‌, అభినందన్‌, అమ్జద్‌, ఇంతియాజ్‌, అజీజ్‌, మనోజ్‌, బాల్‌రాజ్‌, శివప్రసాద్‌, ఝాన్సీ, సుచరిత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.