close

బుధవారం, ఆగస్టు 21, 2019

ప్రధానాంశాలు

పూలకుండీల కోసం వెళ్లిన యువతి అదృశ్యం

నారాయణగూడ, న్యూస్‌టుడే: పూలకుండీలు తీసుకొస్తానని వెళ్లిన  కూతురు ఇంటికి తిరిగి రాలేదంటూ కుటుంబ సభ్యులు సోమవారం నారాయణగూడ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఎస్సై కరుణాకర్‌ కథనం ప్రకారం... కింగ్‌కోఠిలోని ఇడెన్‌ గార్డెన్స్‌ రోడ్డులోని ఓ అపార్ట్‌మెంటులో నివాసముండే  యువతి (28) శనివారం సాయంత్రం 4 గంటల వేళలో పూల కుండీలు తీసుకొస్తానంటూ ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. స్థానికంగా, తెలిసినవారు, బంధువుల ఇళ్లలో వాకబు చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఓ వ్యక్తి కారణమంటూ ఫిర్యాదులో అనుమానం వ్యక్తం  చేశారు. కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఆమె సెల్‌ఫోన్‌ లోకేషన్‌, సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.