close

గురువారం, ఆగస్టు 22, 2019

ప్రధానాంశాలు

సమస్యలు వేగంగా పరిష్కరించాలి

ప్రజావాణిలో సంయుక్త కలెక్టర్‌ రవి

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించి వేగంగా పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని హైదరాబాద్‌ జిల్లా సంయుక్త కలెక్టర్‌ రవి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను జిల్లా డీఆర్‌ఓ భూపాల్‌రెడ్డితో కలిసి ఆయన స్వీకరించారు. పలు సమస్యలపై 34 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు జేసీ సూచించారు. యూసుఫ్‌గూడకు చెందిన దివ్యాంగురాలు సీహెచ్‌ రాణి.. తనకు బీసీ కార్పొరేషన్‌ ద్వారా ఆర్థిక సాయం అందించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఈడీకి జేసీ ఆదేశించారు. రియాసత్‌నగర్‌కు చెందిన చాంద్‌బేగం.. తనకు వితంతు పెన్షన్‌ మంజూరు చేయాలని అభ్యర్థించారు. హష్మాబాద్‌లో రోడ్లను తవ్వి అలాగే వదిలేశారని తక్షణమే రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని చాంద్రాయణగుట్ట హష్మాబాద్‌కు చెందిన సయ్యద్‌ మోయిన్‌ వినతిపత్రం అందించారు. ఖైరతాబాద్‌ ప్రేమ్‌నగర్‌ బస్తీలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కల్యాణమండపంగా మార్చాలని ప్రేమ్‌నగర్‌ సంఘం, నవ భారత్‌ యువజన సంఘం కమిటీ సభ్యులు దరఖాస్తు సమర్పించారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖాధికారులకు జేసీ ఆదేశించారు. హైదరాబాదు ఆర్‌డీఓ శ్రీనివాస్‌రెడ్డి, సికింద్రాబాద్‌ ఆర్‌డీఓ రాజాగౌడ్‌, డీఈఓ వెంకటనర్సమ్మ, సీపీఓ రామభద్రం, ఎల్‌డీఎం శ్రీనివాస్‌, జిల్లా సంక్షేమాధికారి ఝాన్సీ లక్ష్మీబాయి, తహసీల్దార్లు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.