close

గురువారం, ఆగస్టు 22, 2019

ప్రధానాంశాలు

వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

హత్యేనని కుటుంబీకుల ఫిర్యాదు

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మార్కెట్‌ ఠాణా పరిధిలో జరిగింది. మార్కెట్‌ పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... పార్సీగుట్ట, గంగపుత్ర కాలనీకి చెందిన శ్రావణ్‌కుమార్‌, జ్యోతిల కుమార్తె హేమలత(23)ను మోండా ఆదయ్యనగర్‌కు చెందిన విజయలక్ష్మి, నర్సింగ్‌రావుల కుమారుడు కిరణ్‌కు ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం చేశారు. పెళ్లైన కొద్ది రోజులకే అదనపు కట్నం కోసం అత్తా, ఆడపడుచులతో పాటు భర్త వేధింపులకు గురి చేసేవారు. హేమలత తన సోదరుడితో కలిసి షీ-బృందానికి ఫిర్యాదుచేసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న భర్త ఫిర్యాదు వెనక్కి తీసుకోకుంటే తాను చనిపోతానని ఫోన్‌ చేసి బెదిరించడంతో కేసు వాపసు తీసుకుంది. అనంతరం కూడా వేధింపులు ఆగలేదు. సోమవారం ఉదయం 11గంటలకు హేమలత తన సోదరుడికి ఫోన్‌ చేసి భర్తకు మరో పెళ్లి చేస్తామంటున్నారని విలపిస్తూ చెప్పింది. మరోమారు పంచాయతీ పెట్టించాలని కోరగా రెండ్రోజుల్లో వస్తామని సోదరుడు చెప్పాడు. కానీ 12 గంటలకు ఆమె సీలింగ్‌ ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న మార్కెట్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హేమలత ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అత్తింటివారే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు క్లూస్‌ బృందాన్ని పిలిపించి ఆధారాలు సేకరించారు. ఆమె కుటుంబసభ్యులను ఒప్పించి మృతదేహాన్ని సాయంత్రం 7గంటలకు గాంధీ మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.