close

శనివారం, ఆగస్టు 24, 2019

ప్రధానాంశాలు

కళాశాలలోకి అనుమతివ్వలేదని ఆందోళన

విద్యార్థినుల తల్లిదండ్రులతో చర్చిస్తున్న ఎస్సై నరేష్‌, ప్రిన్సిపల్‌ వనజ

మర్కల్‌ (సదాశివనగర్‌) న్యూస్‌టుడే : మర్కల్‌ గ్రామ శివారులోని కామారెడ్డి సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు , తల్లిదండ్రులు సోమవారం సాయంత్రం 44వ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ఒక రోజు ఆలస్యంగా వచ్చారని, విద్యార్థినులను ప్రిన్సిపల్‌ కళాశాలలోకి అనుమతించలేదు. బిచ్కుంద, జుక్కల్‌, మద్నూర్‌ ప్రాంతాల నుంచి తమ బిడ్డలను కళాశాలకు తీసుకొని వస్తే ప్రిన్సిపల్‌ అనుమతి ఇవ్వలేదని తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటల వచ్చినా సాయంత్రం 5:30 వరకు లోపలకు రానివ్వలేదన్నారు. ఈ నెల 14 లోగా కళాశాలకు వచ్చిన వారికే అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు ప్రిన్సిపల్‌ చెప్పారు. 15వ తేదీన వచ్చిన వారు వరంగల్‌ వెళ్లి అనుమతి తీసుకురావాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌, విద్యార్థినుల తల్లిదండ్రుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు జాతీయరహదారిపై నిరసనకు దిగి 30 నిమిషాల పాటు ఆందోళన చేపట్టారు. ఇక్కడకు ఎస్సై నరేష్‌ వచ్చి విద్యార్థినుల తల్లిదండ్రులతో చర్చించారు. ఏకాదశి పండుగ రావడం వల్ల ఒక రోజు ఆలస్యంగా వచ్చామని, తమకు అనుమతి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రిన్సిపల్‌ ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో చరవాణి ద్వారా చర్చించగా.. ఆలస్యంగా వచ్చిన 180 మంది నుంచి రూ.25 చొప్పున జరిమానా విధించాలని సూచించారు. ఇక ముందు ఆలస్యంగా వస్తే తీసుకునే చర్యలకు అంగీకారం తెలుపుతూ పత్రాలు రాయించుకోవాలని చెప్పారు. ఎట్టకేలకు విద్యార్థినులు జరిమానాలు చెల్లించి కళాశాలలోకి వెళ్లారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.