close

సోమవారం, ఆగస్టు 26, 2019

ప్రధానాంశాలు

శ్రీశైలం మల్లన్న ఆలయం మూసివేత


శ్రీశైలం : ఆలయాన్ని మూసివేసిన అధికారులు, అర్చకులు.. మహానందిలో

రాజగోపురం తలుపులను మూసివేస్తున్న పండితులు, ఆలయ పర్యవేక్షకులు

శ్రీశైలం న్యూస్‌టుడే: చంద్రగ్రహణం కారణంగా శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉభయ దేవాలయాలు మూసివేశారు. మంగళవారం సాయంత్రం 4.00 గంటలకు ఆలయ ప్రధాన ద్వారాలను ఏసీ కోదండరామిరెడ్డి ఆధ్వర్యంలో మూసివేశారు. తిరిగి 17వ తేది బుధవారం ఉదయం 5.30 గంటలకు ద్వారాలు తెరచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ నిర్వహించి, శ్రీ స్వామిఅమ్మవార్లకు ప్రాతఃకాల పూజలను నిర్వహించిన అనంతరం ఉదయం 8 గంటల నుంచి శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనాలు, ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన, కల్యాణం, హోమాలు తదితర పూజలను యథావిధిగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతించారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ద్వారాలను మూసివేశారు. ఈ కార్యక్రమంలో ఏఈవో కృష్ణారెడ్డి, పర్యవేక్షకులు డి.మల్లయ్య, మల్లికార్జునరెడ్డి, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

అహోబిలం(ఆళ్లగడ్డ గ్రామీణ), న్యూస్‌టుడే: అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయం మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మూసివేశారు. చంద్రగ్రహణం సందర్భంగా నవ నృసింహక్షేత్రాలను మూసివేసినట్లు ఆలయ ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్‌ తెలిపారు. గ్రహణం ముగిసిన తర్వాత బుధవారం తెల్లవారుజామున ఆలయ సంప్రోక్షణ చేసి ఆరు గంటల నుంచి దర్శనం కల్పిస్తామని చెప్పారు.

మహానంది, న్యూస్‌టుడే: కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని మహానంది పుణ్యక్షేత్రంలోని అన్ని ఆలయాలను మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి మూసివేశారు. వేదపండితులు రవిశంకరఅవధాని ఆధ్వర్యంలో ప్రధాన గర్భగుడులు, ఐదంతస్థుల రాజగోపురం తలుపులను మూసివేశారు. వేదపండితులు రవిశంకరఅవధాని మాట్లాడుతూ 17న తేదీ వేకువ ఝామున 5 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.