close

శనివారం, ఆగస్టు 24, 2019

ప్రధానాంశాలు

అంతా గోప్యం.. బదిలీ జాప్యం

● అయిదు రోజులైనా విడుదల చేయని బదిలీల జాబితా

● నేతల లేఖలతో బదిలీల్లో మార్పులు


గడివేముల గ్రామ పంచాయతీ కార్యాలయం

కర్నూలు నగరం (జడ్పీ), న్యూస్‌టుడే: పంచాయతీ కార్యదర్శుల బదిలీల జాబితాను మరింత గోప్యంగా ఉంచుతున్నారా..? నేతల సిఫార్సులతో జాబితాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈనెల 12 తేదీన కార్యదర్శుల బదిలీలు చేసినప్పటికీ ఇప్పటి వరకు జాబితా విడుదల చేయకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 204 మంది పంచాయతీ కార్యదర్శులను కలెక్టరు అనుమతితో డీపీవో ప్రభాకర్‌రావు బదిలీ చేశారు. వాస్తవానికి బదిలీ అయిన కార్యదర్శుల జాబితాలను డీపీవో కార్యాలయం నోటీసు బోర్డులో అతికించడంతోపాటు మూడు డివిజన్‌ పంచాయతీ కార్యాలయాలకు పంపాల్సి ఉంది. కాని ఇంతవరకు పంపలేదు. దీంతోపాటు ఏ కార్యదర్శిని ఎక్కడకు బదిలీ చేశారనే అంశం గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా కార్యదర్శుల బదిలీలపై డీఎల్‌పీవోలూ పట్టించుకోవడం కోవడం లేదు. జిల్లాలోని కర్నూలు, నంద్యాల డీఎల్‌పీవోలు అనంతపురం జిల్లాకు బదిలీ అయ్యారు. తమ ప్రమేయం లేకుండా బదిలీలు చేయడంతోపాటు వెళ్లేముందు ఈ తలనొప్పి ఎందుకని వారు పట్టించుకోవడం లేదని సమాచారం.

బదిలీల్లో ‘మళ్లీ’ మార్పులు..?

తాజా సమాచారం మేరకు నేతల సిఫార్సులకు అనుగుణంగా కార్యదర్శుల బదిలీల్లో మార్పులుచేస్తున్నారని, అందువల్లే బదిలీల జాబితాను విడుదల చేసేందుకు జాప్యం అవుతోందని చర్చించుకుంటున్నారు. దీనికితోడు డీపీవో కార్యాలయంలో సంబంధిత ఉద్యోగి సెలవులో ఉండటంతో జాబితా బయటకు వచ్చేందుకు అవకాశం లేదని, ఈ జాబితా వివరాలన్నీ అతని ఆధీనంలోనే ఉండటంతో జాబితా వెలువడం లేదని చెబుతున్నారు. బదిలీల జాబితాలపై డీపీవోను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. బదిలీల వివరాలను సంబంధిత కార్యదర్శులకు వ్యక్తిగతంగా పంపుతున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.