close

బుధవారం, ఆగస్టు 21, 2019

ప్రధానాంశాలు

డీఎస్సీ-2018 అభ్యర్థులకు తీపి కబురు

నియామక ప్రక్రియ ప్రారంభం

 జిల్లాకు చేరిన ఎంపిక జాబితా

 

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: ఏడాదిగా ఎదురుచూస్తున్న డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు అందనుంది. డీఎస్సీ-2018 సంబంధించి జిల్లా స్థాయిలో కొలువుల భర్తీకి డీఈవో కార్యాలయ అధికారులు కసరత్తు ప్రారంభించారు. డీఎస్సీ పరీక్షకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక జాబితా జిల్లా విద్యాశాఖకు బుధవారం అందింది. విద్యాశాఖ పంపిన ఎంపిక జాబితాను పరిశీలించి చివరి జాబితాను డీఈవో వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నారు. తొలివిడతగా పాఠశాల సహాయకులు, అనంతరం సెకండరీ గ్రేడ్‌ టీచర్ల పోస్టులను భర్తీ చేస్తారు. ఇప్పటికే జోనల్‌స్థాయి పోస్టులకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసిన విషయం తెలిసిందే. మిగిలిన కొలువులకు కర్నూలులోని బి.క్యాంపు ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన శిబిరంలో అభ్యర్థులు ఆన్‌లైన్‌లో పొందుపరిచిన ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. ఈమేరకు షెడ్యూలు ప్రకారం పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

జడ్పీ, ప్రభుత్వ, ఎంపీపీ యాజమాన్యంలో 546, మున్సిపల్‌ కార్పొరేషన్‌-20, మున్సిపల్‌-62, గిరిజన సంక్షేమ పాఠశాలలో 12 కొలువులను భర్తీ చేసేందుకు పరీక్షలు నిర్వహించారు. జిల్లాస్థాయిలో ప్రభుత్వ, జడ్పీ, పురపాలక, గిరిజన సంక్షేమ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయా యాజమాన్యాల్లో 640 కొలువులు ఉన్నాయి. వీటి కోసం గత డిసెంబరు, జనవరిలో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించారు. అర్హత సాధించినవారితో పాఠశాల సహాయకులు, ఎస్జీటీ పోస్టులను వేర్వేరుగా భర్తీ చేస్తారు. భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి న్యాయస్థానంలో వ్యాజ్యం ఉండడంతో వీటి భర్తీపై స్పష్టత రావాల్సి ఉంది. మిగిలిన ప్రిన్సిపల్‌, పీజీటీ, టీజీటీ పోస్టులకు జోనల్‌వారీగా ఇప్పటికే కడప ఆర్జేడీ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన పూర్తైంది. జిల్లా కేంద్రంలో జరిగే పరిశీలనకు విద్యాశాఖ షెడ్యూలు విడుదల చేసింది. దీని ప్రకారం తుది జాబితాను ప్రచురించి ఖాళీల ఎంపిక నిమిత్తం ప్రత్యామ్నాయాలు ఇచ్చుకునేందుకు రెండు రోజుల గడువును నిర్దేశించారు.

షెడ్యూలు ఇలా..

జులై 17 నుంచి ఆగస్టు 5 వరకు పాఠశాల సహాయకులకు, ఆగస్టు 2 నుంచి సెప్టెంబరు 4 వరకు ఎస్జీటీలకు కౌన్సెలింగ్‌ నిర్వహించి నియామక ఉత్తర్వులు జారీ చేసేలా షెడ్యూలు రూపొందించారు.

19న విద్యాశాఖ పంపిన ప్రొవిజనల్‌ను జిల్లా డీఎస్సీ కమిటీ పరిశీలించి స్పష్టతకు వస్తుంది. అనంతరం కమిటీ గుర్తించిన జాబితాను అభ్యర్థులు చూసుకునేలా ఆన్‌లైన్‌లో ప్రదర్శిస్తారు.

ప్రొవిజనల్‌లోని అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను ఈనెల 20, 21 తేదీల్లో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

అప్‌లోడ్‌ చేసిన సర్టిఫికెట్లను 22, 23 తేదీల్లో డీఎస్పీ కమిటీ ఆధ్వర్యంలో మరోసారి పరిశీలన చేస్తారు. 23వ తేదీన అనర్హులైన వారి వివరాలు ప్రకటిస్తారు. 24న మరోసారి ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.

ఇలా మూడు దశలుగా ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. చివరిగా ఈనెల 31వ తేదీన కమిటీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో పొందుపరిచిన సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. అనంతరం తుది జాబితా ప్రకటిస్తారు.

సెకండరీ గ్రేడ్‌ టీచర్ల షెడ్యూలు ఇలా..

ఆగస్టు 2వ తేదీన ప్రొవిజినల్‌ వివరాలను సీఎస్‌ఈ జాబితాలో పొందుపరుస్తారు.

కమిటీ జాబితాను పరిశీలించి 5వ తేదీన ప్రొవిజినల్‌ జాబితాను గుర్తిస్తారు.

జాబితాలోని అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను 6, 7 తేదీల్లో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను డీఎస్సీ కమిటీ ఆధ్వర్యంలో 8, 9 తేదీల్లో పరిశీలన చేస్తారు. మూడు దశల్లో పరిశీలనలో అనర్హులను గుర్తించి మరోసారి జాబితా ప్రకటన చేస్తారు.

28వ తేదీన అభ్యర్థుల చివరి జాబితాను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. సెప్టెంబరు 4వ తేదీన పోస్టింగులకు సంబంధించి నియామక ఉత్తర్వులు ఇస్తారు.

అభ్యర్థులు పాటించాల్సినవి..

ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాల ఆధారంగా ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల నమోదులో జాగ్రత్తలు పాటించాలి. ఒకవేళ తప్పుగా నమోదు చేస్తే మార్పులు, చేర్పులు చేసేందుకు జిల్లాస్థాయిలో ఫిర్యాదుకు అవకాశం లేదు. జిల్లాస్థాయిలో భర్తీ చేసే పోస్టులకు సంబంధించి విద్యాశాఖ, పురపాలక, గిరిజన, సంక్షేమ శాఖల అధికారుల సమన్వయంతో ధ్రువపత్రాల పరిశీలన, నియామక ప్రక్రియ జరుగుతుంది. ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైతే వారు ఏ పోస్టుకు ప్రాధాన్యం ఇస్తారో కమిటీ అధికారులు తెలుసుకుని రాతపూర్వకంగా తీసుకుని తగిన జాగ్రత్తలు పాటిస్తారు. ఆ పోస్టులో తర్వాత ర్యాంకు అభ్యర్థికి అవకాశం కల్పిస్తారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.