close

మంగళవారం, ఆగస్టు 20, 2019

ప్రధానాంశాలు

గోప్యత ఎందుకో..? 

మాదకద్రవ్యాల వ్యవహారంలో చిక్కిన పెద్దచేప

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ఎక్కడైనా మాదకద్రవ్యాలు పట్టుబడితే నానా హడావిడి చేసే పోలీసులు ఏకంగా ఓ పబ్బు యజమాని సోదరుడు పట్టుబడి.. దాదాపు 20 రోజులకుపైగా జైలులో ఉన్నా విషయం బయటకు పొక్కకుండా గోప్యత పాటించడం అనుమానాలకు తావిస్తోంది. నెల రోజుల క్రితం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారులకు బంజారాహిల్స్‌ ప్రాంతంలో మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ఓ జంట పట్టుబడింది. ఓ అపార్ట్‌మెంటులో వ్యభిచారం నిర్వహించడమే కాకుండా అవసరమైన వారికి మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం ఓ ముఠాను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ పోలీసులు వలవేసి మరీ షేక్‌ ఫహద్‌తో పాటు అతని భార్య సలీమా రబ్బీయుల్‌ షేక్‌ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 9 గ్రాముల కొకైన్‌, రూ. 3 లక్షల నగదు, కారు, స్వైపింగ్‌ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వారి చరవాణుల్లోని ఆధారాల ప్రకారం కొందరు నైజీరియన్లను సైతం అరెస్టు చేసి, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్ల నుంచి జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్బు యజమాని రోహిత్‌రెడ్డి సోదరుడు రాహుల్‌రెడ్డి డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఆధారాలు లభించడంతో అతన్ని అరెస్టు చేశారు. రాహుల్‌రెడ్డి దాదాపు 20 రోజులకు పైగా చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవించి బుధవారం విడుదలయ్యారు. అయితే ఈ వ్యవహారంలో ఓ అధికారి జోక్యంతో మీడియా కంటపడకుండా నిందితుడిని జైలుకు తరలించారని తెలుస్తోంది. ఈ విషయమై ఎక్సైజ్‌ పోలీసు అధికారులను సంప్రదించగా వారు స్పందించలేదు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.