close

బుధవారం, ఆగస్టు 21, 2019

ప్రధానాంశాలు

బోనమెత్తనున్న లాల్‌దర్వాజా 

నేటి నుంచి 11 రోజుల పాటు ఉత్సవాలు 
ముస్తాబైన అమ్మవారి ఆలయాలు

చాంద్రాయణగుట్ట, న్యూస్‌టుడే: ప్రసిద్ధి చెందిన లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాలు నేడు(శుక్రవారం) ప్రారంభం కానున్నాయి. పదకొండు రోజుల పాటు వైభవంగా కొనసాగనున్నాయి. ఇప్పటికే  ప్రభుత్వం, ఆలయ కమిటీలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. పాతబస్తీలోని ఆలయాలకు రంగులు వేసి విద్యుద్దీపాలతో అలంకరించాయి. ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 
వరద నుంచి కాపాడిన తల్లి.. 
లాల్‌దర్వాజా శ్రీసింహవాహినీ మహంకాళీ దేవాలయంలో 1908 నుంచి ఏటా ఆషాఢమాసంలో బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మూసీ వరదలు నగరాన్ని ముంచెత్తినప్పుడు నాటి నిజాం ప్రధాని మహారాజా కిషన్‌ప్రసాద్‌ సూచన మేరకు నిజాం నవాబు మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ లాల్‌దర్వాజా సింహవాహినీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి చీరె, పసుపు, కుంకుమ, ముత్యాలు, గాజులు సమర్పించి, హారతి ఇవ్వగా వరదలు తగ్గుముఖం పట్టాయని పెద్దలు చెబుతుంటారు. 
ఎర్రని గోడ దర్వాజ పక్కనే.. 
అసఫ్‌జాహీల కాలంలో నగర రక్షణకు నగరం చుట్టూ నిర్మించిన గోడకు ఏర్పాటు చేసిన 13 దర్వాజాల్లో లాల్‌దర్వాజా ఒకటి. ఇక్కడి దర్వాజాకు జాజు(ఎర్రని) రంగు ఉండటంతో ఈ దర్వాజాను లాల్‌దర్వాజా అని పిలిచేవారు. లాల్‌దర్వాజా సమీపంలో వెలసిన అమ్మవారు సింహ వాహనం కలిగి ఉండడంతో సింహవాహినీ మహంకాళీగా పిలుస్తున్నారు. 
ప్రముఖుల సందర్శన 
ఏడేళ్ల క్రితం నేటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాల్‌దర్వాజా దేవాలయాన్ని సందర్శించి, అమ్మవారికి గండదీపం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే లాల్‌దర్వాజా అమ్మవారికి బోనం సమర్పిస్తామని మొక్కుకున్నారు. రాష్ట్రం సిద్ధించిన వెంటనే 2014లో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ అమ్మవారికి బంగారు బోనం సమర్పించి మొక్కు చెల్లించుకోవడం గమనార్హం. దిల్లీ ఉత్సవాల్లో  ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును పాల్గొన్నారు. రాజకీయ, క్రీడాకారులు ప్రముఖులు మొక్కులు  సమర్పిస్తుంటారు. 

బంగారు బోనం ఇక్కడ పుట్టిందే.. 
ఆలయ కమిటీ అయిదేళ్లుగా దిల్లీలో ఉత్సవాలు నిర్వహిస్తూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను దేశ ప్రజలకు తెలియజేస్తోంది. బంగారు బోనం మొట్టమొదటగా సమర్పించింది లాల్‌దర్వాజా మహంకాళీ అమ్మవారికే. ఆలయ కమిటీ ప్రతినిధులు 2014లో బంగారు బోనంను చేయించి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేత అమ్మవారికి సమర్పింపజేశారు.

అన్ని ఏర్పాట్లు చేశాం 

లయంలో బోనాల ఉత్సవాలు నేటి నుంచి పదకొండు రోజుల పాటు నిర్వహిస్తాం. నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ శిఖరపూజ, చేసి ఉత్సవాలు ప్రారంభిస్తారు. 29 వరకు ప్రత్యేక పూజలు కొనసాగుతాయి. వేడుకలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డితో పలువురు ప్రముఖులను ఆహ్వానించాం. ఉత్సవాల కోసం ఆలయకమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. జీహెచ్‌ఎంసీ రోడ్ల నిర్మాణం, వీధిదీపాల ఏర్పాటు వంటి పనులు చేపట్టింది. దూరప్రాంత భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపనుంది.

- తిరుపతి నర్సింగరావు, ఆలయకమిటీ ఛైర్మెన్

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.