close

సోమవారం, ఆగస్టు 26, 2019

ప్రధానాంశాలు

94906 16555 

సమాచారమా? వాట్సాప్‌ చేయండి! 
నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌

నారాయణగూడ, న్యూస్‌టుడే: కోటి మంది నివసించే నగరంలో కనీసం 10 లక్షలకుపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం కేవలం 2.82 లక్షల సీసీ కెమెరాలు  ఏర్పాటు చేసుకోగలిగామన్నారు. గురువారం సాయంత్రం నగర పోలీసు కమిషనరేట్‌లో  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భాగ్యనగరాన్ని సురక్షిత నగరంగా తీర్చిదిద్దుకోవాలంటే ‘నేను సైతం’ కార్యక్రమం కింద కాలనీవాసులు, అపార్ట్‌మెంటు సంఘాలు, వ్యాపార సంస్థల సంఘాలు ముందుకు వచ్చి స్థానిక పోలీసుల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఎన్నో కేసులు సీసీ కెమెరాల ద్వారా పరిష్కారమవుతున్నాయన్నారు. నగరంలో ‘హాక్‌ ఐ’ యాప్‌నకు మరింత ప్రాధాన్యం పెరగాల్సిన అవసరం ఉందని పోలీసు కమిషనర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం 9.60 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని ఆయన వెల్లడించారు. కనీసం యాభై లక్షల మందికి చేరువ కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానంగా మహిళలు, యువతులు సురక్షితంగా తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఇది ఉపకరిస్తుందన్నారు. పని మనుషుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఎవరినైనా పని మనిషిగా కుదుర్చుకోవాలని అనుకున్నప్పుడు వివరాలను తమకు పంపిస్తే రెండు రోజుల్లో వారి గురించి సమగ్ర సమాచారం ఇస్తామన్నారు. ఏదైనా ఘటన జరిగినా.. ఎవరైనా అనుమానితులు కనిపించినా.. ఏమైనా ఘటనలు దృష్టికి వచ్చినా.. ఫొటోలు, వీడియోలు తదితర సమాచారం 94906 16555 నంబరుకి వాట్సాప్‌ ద్వారా తమకు పంపించాలని అంజనీకుమార్‌ సూచించారు. ఈ నంబరు నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఉంటుందన్నారు. సమాచారం ఇచ్చినవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన చెప్పారు.
 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.