close

ఆదివారం, ఆగస్టు 25, 2019

ప్రధానాంశాలు

ఉత్తర్వు 91ని అమలు చేయండి  

 
సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర భాషోపాధ్యాయ

సంఘం జిల్లా అధ్యక్షులు ఉమామహేశ్వర్‌

శ్రీకాళహస్తి గ్రామీణం, న్యూస్‌టుడే: సుదీర్ఘకాలం అపరిష్కారంగా ఉన్న బాషోపాధ్యాయుల ఉన్నతీకరణ ఉత్తర్వు 91ని వెంటనే అమలుచేసి పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర బాషోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు ఉమామహేశ్వర్‌ అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం రాష్ట్ర బాషోపాధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యాశాఖలో అన్ని స్థాయిల్లో పదోన్నతులు నిర్వహించి బాషోపాధ్యాయులను మాత్రమే విస్మరించడం దారుణమన్నారు. గత రెండేళ్లుగా రాష్ట్ర బాషోపాధ్యాయ సంఘం పోరాట ఫలితంగా ప్రభుత్వం తమ ఉన్నతీకరణ కోసం జీవో సంఖ్య 91ని జారీచేసిందని, అది ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడం బాధాకరమన్నారు. నూతన ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన కోర్కెను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అభ్యర్థించారు. ప్రభుత్వం సత్వరం స్పందించకుంటే రాష్ట్ర శాఖ నిర్ణయం మేరకు ఉద్యమాలకు సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి హరిబాబు, నాయకులు రమేష్‌, మునస్వామి, గోవింద్‌, తిరుమలయ్య, అంబదాస్‌, సుబ్రహ్మణ్యం, ప్రసాద్‌, భాస్కరయ్య, మునిప్రసాద్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.