close

ఆదివారం, ఆగస్టు 18, 2019

ప్రధానాంశాలు

ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయండి

 ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు

 
మాట్లాడుతున్న గాజుల నాగేశ్వరరావు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి పథకాన్ని ప్రైవేట్‌ పాఠశాలలకు వర్తింపచేసి ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేయొద్దని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల నాగేశ్వరరావు సూచించారు. స్థానిక సలాంఖాన్‌ భవనంలోని ఎస్టీయూ కార్యాలయంలో ఆదివారం రాష్ట్రోపాధ్యయ సంఘం జిల్లా అధ్యక్షుడు హెచ్‌.తిమ్మన్న అధ్యక్షతన జిల్లా ద్వితీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో నవరత్నాల్లో భాగంగా ఈఏడాది నుంచి అమలు చేయబోతున్న అమ్మఒడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయవద్దన్న అంశాన్ని సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ పథకం ద్వారా ఖర్చు చేస్తున్న నిధులతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయిలో అన్నివసతులతో తీర్చిదిద్దవచ్చన్నారు. రాష్ట్రంలోని జూనియర్‌ కళాశాలలో ఖాళీగా ఉన్న జేెఎల్‌ పోస్టులకు అర్హులైన పాఠశాల సహాయకులతో భర్తీ చేయాలని, పాఠశాల విద్యలో ఖాళీగా ఉన్న 15వేల టీచర్ల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. త్వరితగతిన ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించాలని, ఐఆర్‌ 20 శాతం యథాతథంగా అమలు చేయాలన్నారు. పీఆర్సీ గడువు పెంచడం అన్యాయమన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని తమిళనాడు తరహాలో చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పి.ప్రసాద్‌, ఈ.షన్మూర్తి, సి.రమేష్‌, పాలయ్య, బి.శ్రీనివాసులు, బసవరాజు, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.