close

ఆదివారం, ఆగస్టు 25, 2019

ప్రధానాంశాలు

చిన్నారుల కిడ్నాప్‌ కలకలం

నిందితుడికి స్థానికుల దేహశుద్ధి

ఆసిఫ్‌నగర్‌, న్యూస్‌టుడే: ఆసిఫ్‌నగర్‌, జిర్రాలో చిన్నారుల కిడ్నాప్‌ కలకలం రేపింది. అక్కా చెళ్లెళ్లు తనతో పాటు తీసుకెళ్తున్న వ్యక్తిని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆసిఫ్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగం రవీందర్‌, స్థానికుల కథనం ప్రకారం... జిర్రా, కిషన్‌నగర్‌కు చెందిన ఇద్దరు చిన్నారులు ఇంటి వద్ద ఆడుకుంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2.30గంటల సమయంలో జిర్రా ప్రాంతానికి చెందిన సలీం(30), చిన్నారులను చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి తనతో తీసుకెళ్లాడు. జిర్రా రోడ్డులోని సిటీ డైమండ్‌ హోటల్‌ వరకు బాలికలను తీసుకెళ్లి అరటిపండ్లు కొనిపించాడు. కిషన్‌నగర్‌కు చెందిన యువకులు చిన్నారులను గుర్తించి ఎక్కడికి  తీసుకెళ్తున్నావంటూ సలీంను ప్రశ్నించారు. తాగిన మత్తులో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో, చిన్నారుల బావ ఇబ్రహీంకు సమాచారం అందించారు. స్థానికులు సలీంకు దేహశుద్ధి చేసిన పోలీసులకు అప్పగించారు. నిందితుడిని ఠాణాకు తరలించి విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.