close

ఆదివారం, ఆగస్టు 25, 2019

ప్రధానాంశాలు

చిట్టిబుర్రలకు స్ఫూర్తి.. పరిశోధనలపై ఆసక్తి

ఖగోళ అంశాలపై జిజ్ఞాస కల్గించేందుకు  కార్యశాల
ఈనాడు, హైదరాబాద్‌

ఖగోళ అంశాలు ఎప్పుడు ఆసక్తినే.. ఎన్నో సందేహాలు.. మరెన్నో అనుమానాలు.. అప్పటికీ ఇప్పటికీ కూడా. చిన్నతనంలోనే అమ్మ పరిచయం చేసిన చందమామ గురించైతే సమాధానం దొరకని ప్రశ్నలెన్నో. సమాధానాలు తెలుసుకునేందుకు అమెరికా వ్యోమగాములు నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, బజ్‌ ఆల్ట్రిన్‌లు అయిదు దశాబ్దాల  క్రితమే చందమామపైకి ప్రవేశించారు. జులై 20కి సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పిల్లల్లో ఖగోళ పరిశోధనలపై ఆసక్తి కల్గించేందుకు యూఎస్‌ కాన్సులేట్‌ రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో కార్యశాలలను నిర్వహించింది.
మనవాళ్లు చంద్రయాన్‌-1 పేరుతో గతంలో చంద్రుడిపైకి అడుగుపెట్టారు. మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు చంద్రయాన్‌-2ని రోదసీలోకి పంపించేందుకు ఇస్రో కౌంట్‌డౌన్‌ తాజాగా మొదలెట్టింది. సోమవారం మధ్యాహ్నం ప్రయోగించనున్నారు. సరిగ్గా ఇప్పుడే అమెరికాకి చెందిన అపోలో-11 చంద్రుడి ఉపరితలంపైకి అడుగుపెట్టి యాభై ఏళ్లు అయ్యింది. ఇవన్నీ కూడా నేటితరం పిల్లల్లో శాస్త్రవిజ్ఞానం, ఖగోళ పరిశోధనలపై ఉత్సుకతను కల్గిస్తాయి. ఏ దేశం ప్రతిష్ఠాత్మక అంతరిక్ష ప్రయోగాలు చేపట్టినా వాటి ఫలితాలు ఎలా ఉన్నా.. ప్రయోగాలు మాత్రం ఎంతోమందికి పిల్లలను స్ఫూర్తిగా నిలుస్తాయి. పెద్దయ్యాక ఖగోళ శాస్త్రవేత్తనయి మరింతగా పరిశోధించాలని నిర్ణయించుకున్నవారు గతంలో ఎందరో ఉన్నారు. దేశ, విదేశాల్లోని ఇప్పుడు ఉన్న శాస్త్రవేత్తల్లో చాలామందిని ఇటువైపు రప్పించిన ప్రయోగాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి.

ఎంపిక చేసిన పిల్లలకు..
యు.ఎస్‌.డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ ఎక్స్ఛేంజ్‌ అలుమ్నా సారథ్యంలో మౌలానా అజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీలో కార్యశాల నిర్వహించారు. ఇందుకోసం వెనకబడిన వర్గాల పిల్లలను 100 మందిని ఎంపిక చేసి ఇక్కడికి రప్పించారు. వీరికి అంతరిక్ష ప్రయోగాల గురించి వివరించడంతో పాటూ వారి సందేహాలను నివృత్తి చేశారు. వాటర్‌ రాకెట్లు, టెలిస్కోప్‌ల తయారీ గురించి తెలుసుకున్నారు. బిర్లా ప్లానిటోరియంలో ఖగోళం గురించి అక్కడి ప్రదర్శనలో తెలుసుకున్నారు. అక్కడ ఉన్న టెలిస్కోప్‌లు ఎలా పనిచేస్తాయో స్వయంగా గమనించారు.

జిజ్ఞాస పెంచేలా..
- డాక్టర్‌ హసన్‌, మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం
అంతరిక్ష అన్వేషణ వయస్సు, నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తే. పిల్లల్లో జిజ్ఞాస పెంచేందుకు ఈ తరహా కార్యశాలలు మేలు. ఫిజిక్స్‌, సైన్స్‌లోని ప్రాథమిక భావనలను విద్యార్థుల్లో పెంపొందిస్తే చాలా రంగాల్లో ఉపయోగపడతాయి.

ప్రయోగాల సమయం..
- ఆకాశ్‌ సూరి, యూఎస్‌ కాన్సులేట్‌
అంతరిక్ష పరిశోధనలో ఇది అత్యంత ఉత్తేజకరమైన సమయం. చంద్రునిపైకి అమెరికా వ్యోమగాములు అడుగుపెట్టి 50 వసంతాలైంది. ఇదే సమయంలో భారత్‌ చందమామపై తమదైన అంతరిక్ష ముద్ర వేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.