close

ఆదివారం, ఆగస్టు 25, 2019

ప్రధానాంశాలు

మహాకాళి సేవలో..!

భక్తుల వెన్నంటే అధికార యంత్రాంగం
 కలిసొచ్చిన స్వచ్ఛంద సంస్థలు

బన్సీలాల్‌పేట్‌, న్యూస్‌టుడే: ఉజ్జయిని మహాకాళి ఆషాఢమాస బోనాల జాతరలో అధికారులు సమన్వయంతో పనిచేశారు. శనివారం రాత్రి నుంచి ఆయా విభాగాల ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాత్రి నుంచే అధికారుల ఆలయం వద్ద విధుల్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం నుంచే పారిశుద్ధ్య సిబ్బంది మహాకాళి అమ్మవారి ఆలయంతో పాటు ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. శనివారం ఉదయం నుంచి సుమారు వెయ్యి మంది కార్మికులు మూడు షిప్టుల్లో పనిచేశారు. బల్దియా ఆధ్వర్యంలో ఆలయం వెనుక వైపు, జనరల్‌ బజార్‌ అంజలి థియేటర్‌ ఇలా ఆయా ప్రాంతాల్లో సంచార మరుగుదొడ్లు (మొబైల్‌ టాయిలెట్లు) ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో సుమారు 5 లక్షల నీటి ప్యాకెట్లను అందజేసింది. అంజలి థియేటర్‌, మహాకాళి ఠాణా, జనరల్‌ బజార్‌ తదితర ప్రాంతాల్లో జలమండలి ఏడు నీటి శిబిరాలను ఏర్పాటు చేసి నీరందించింది. భక్తులకు నీటి ఇబ్బందులు లేకుండా జలమండలి జీఎం రాజశేఖర్‌ పర్యవేక్షించారు. ఆర్టీసీ సికింద్రాబాద్‌ స్టేషన్‌తో పాటు నగరంలోని పలు ప్రాంతాల నుంచి కొన్ని ప్రత్యేక సర్వీసులను నడిపించింది.

వాలంటీర్ల కృషి..
స్వచ్ఛంద సంస్థలు భక్తులకు సేవలందించాయి. దక్కన్‌ మానవ సేవా సమితి, ఆర్యసమాజ్‌, నల్లగుట్ట అభివృద్ధి సంఘం, మక్తల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పెద్దఎత్తున యువకులు, స్వచ్ఛంద సేవకులు తెల్లవారుజాము నుంచే భక్తులకు సేవలందించారు. ఆర్యసమాజ్‌ ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేక హోమం, ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛంద సేవకులకు జనరల్‌ బజార్‌ విఠలేశ్వర స్వామి ఆలయంలో అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందజేశారు. దక్కన్‌ మానవ సేవా సమితి ఏర్పాటు చేసిన వేదిక నుంచి సభ్యులు అమ్మవారి దర్శనానికి వచ్చిన ఆయా రంగాల ప్రముఖులకు స్వాగతం పలికారు. రాత్రి ఫలహారం బండ్లకు ఘనంగా స్వాగతం పలికారు.


 

బల్కంపేట.. భక్తులతో కిటకిట!

సంజీవరెడ్డినగర్‌: బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానం వద్ద ఆషాఢ రద్దీ కొనసాగుతూనే ఉంది. వారం రోజులుగా అమ్మవారి దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం భక్తుల తాకిడి మరింత పెరిగింది. అమ్మవారి దర్శనంతో పాటు బోనం సమర్పించుకోవడానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి మూలవిరాట్టు వద్ద ప్రత్యేక పూజలు, అర్చనలు వంటివి రద్దు చేశారు. క్యూలైన్లు త్వరగా వెళ్లేలా ఆలయ సూపరింటెండెంట్‌ రమేష్‌, సిబ్బంది చర్యలు చేపట్టారు.  విడిది సముదాయంతో పాటు స్థానిక కాలనీలు, ప్రధాన రహదారిలో ఫుట్‌పాత్‌లు బోనాం వండుకునే వారితో నిండిపోయాయి. ఇంత పెద్దఎత్తున భక్తులు తరలిరావడం గతంలో ఎన్నడూ లేదని ఆలయ సిబ్బంది పేర్కొన్నారు.

జాతరకు కట్టుదిట్టమైన భద్రత: సీపీ అంజనీకుమార్‌

రెజిమెంటల్‌బజార్‌: ఉజ్జయినీ మహాకాళి ఆలయానికి వచ్చే భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. రెండువేల మంది పోలీసు సిబ్బందితో భారీ భద్రత ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఆదివారం మహాకాళి ఆలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. 200 సీసీ కెమెరాలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ నుంచి భద్రత పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. లా అండ్‌ అర్డర్‌, టాఫ్రిక్‌ జాయింట్‌ పోలీసు కమిషనర్లు అనిల్‌కుమార్‌, చౌహాన్‌లు, డీసీపీ కల్మేశ్వర్‌, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహంకాళి ఏసీపీ వినోద్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ జైపాల్‌రెడ్డి అధికారులతో కలిసి భద్రత ఏర్పాట్లలో మునిగి పోయారు.  వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో బీపీ, షుగర్‌, నీరసంతో పడిపోయిన భక్తులకు వైద్యసేవలను అందించారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి వెంకటితో పాటు వైద్యులు సీఆర్‌కే ప్రసాద్‌, రాజశ్రీ, పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.