close

ఆదివారం, ఆగస్టు 18, 2019

ప్రధానాంశాలు

ఆరోగ్య‘సిరి’ ధాన్యాలు

 తృణ ధాన్యాలలో అవసరమైన పోషకాలు
 వ్యాధుల నియంత్రణకూ   ఉపయోగం
ఎల్బీనగర్‌, న్యూస్‌టుడే:

ఎల్బీనగర్‌కు చెందిన యాదగిరి ప్రభుత్వ ఉద్యోగి. అధిక బరువుతో బాధపడుతున్నారు. వైద్యులను ఆశ్రయించగా ఆహార నియంత్రణ అవసరం, రోజుకు అరగంట నుంచి గంట వ్యాయామం చేయాలని సూచించారు. వైద్యుని సలహాలు పాటిస్తే ఐదు నెలలకే కొంత ఫలితం కనిపించిందని అంటున్నారు.

నగరవాసులు ఉద్యోగాలు, వ్యాపారాలు.. వృత్తులు, ప్రవృత్తులు, అభిరుచులు, వ్యాపకాలతో క్షణం తీరిక లేకుండా ఉంటున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. సమయానికి తిండి, కంటి నిండా నిద్ర ఉండడం లేదు. ఈ పరిస్థితులు నిత్యం కొనసాగితే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. దీంతో పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ వ్యాయామం అవసరమని వైద్యులు చెబుతున్నారు. చాలా మంది శారీరక దృఢత్వాన్ని కాపాడుకునేందుకు, మరికొందరు అధిక బరువు, మధుమేహం, రక్తపోటు నియంత్రణ కోసం పార్కుల్లోనూ, రహదారులపైనా నడుస్తుంటారు. వ్యాయామం చేస్తే సరిపోతుందిలే.. అని కొంతమంది ఆహార విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. శరీరానికి ఉపయోగపడే పోషకాలు లేని వాటికే ప్రాధాన్యం ఇస్తుంటారు. వాటిల్లో మసాలాలతోపాటు ఉప్పు, పంచదార అధికశాతం ఉండటం వల్ల వ్యాయామం చేసినా ఫలితం ఉండదని నిపుణులు అంటున్నారు. అందుకు జంక్‌ఫుడ్‌తోపాటు కొవ్వు పదార్థాలు మానుకొని అరగంట నుంచి గంట వ్యాయామంతో పాటు ప్రకృతి పరంగా లభించే తృణధాన్యాలు ఆహారంగా తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఏవి సిరిధాన్యాలు.. ఏ వ్యాధులను తగ్గిస్తాయి..!
పోషకాలు, పీచుస్థాయిలను బట్టి ధాన్యానాల్లో కొన్నింటిని సిరిధాన్యాలుగా పిలుస్తున్నారు. వీటికంటే తక్కువ పీచుపదార్థాలు ఉన్న వాటిని తటస్థధాన్యాలుగా వ్యవహరిస్తున్నారు. సిరిధాన్యాలు అవి ఇచ్చే ఆరోగ్యం పరిశీలిస్తే..
* కొర్రలు: నరాల శక్తి, మానసిక దృఢత్వం, ఆర్థరైటిస్‌, పార్కిన్‌సస్‌, మూర్ఛరోగాలు నుంచి విముక్తి కలిగిస్తాయి.
* సామలు: అండాశయం, వీర్యకణ సమస్యలు, పీసీఓడీ, సంతానలేమి వంటి సమస్యలు నివారిస్తాయి.
* అరికలు: రక్తశుద్ధి, డయాబెటిస్‌, మలబద్ధకం, రక్తŸహీనత వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. రోగనిరోధక శక్తి పెంచుతాయి. మంచి నిద్ర కూడా ఇస్తుంది.
* అండుకొర్రలు: బీపీ, ఊబకాయ నివారణ, కంటి సమస్యలు, జీర్ణాశయం, థైరాయిడ్‌, ఆర్థరైటిస్‌, వంటి సమస్యలు నివారిస్తాయి.
* ఊదలు: కొలెస్ట్రాల్‌ తగ్గించడం, ఎండోక్రెయిన్‌గ్లాండ్స్‌, కామెర్లు, పలు వ్యాధులు తగ్గించడం.
ఇవి కాకుండా రాగులు, మొక్కజొన్న, జొన్నలు, తోటకూర గింజలు, నువ్వులు పలు రకాల చిరుధాన్యాలు కూడా ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెప్తున్నారు. జొన్న ఆహారంలో కాల్షియం అధికంగా ఉంటుంది. నువ్వులు తగిన మోతాదులో తీసుకుంటే కాల్షియం, మాంగనీస్‌, ఇనుప ఖనిజాలు అందిస్తాయి. వేరుసెనగ గుండెకు మేలు.

ఎలా వాడాలి?
సిరి ధాన్యాల్లో అండుకొర్రలను 4గంటల పాటు, మిగతా వాటిని కనీసం రెండుగంటలు నాన బెట్టిన తర్వాత వండుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. వీటిని తినాలనే వారు 5 రకాల సిరిధాన్యాలను రెండు రోజులకు ఒక్కటి చొప్పున పదిరోజులు పాటు తీసుకోవాలి. పదకొండు రోజు మళ్లీ మొదటి సిరిధాన్యంతో ఆరంభించాలి. వీటితోపాటు రోజూ అరగంట నుంచి గంట పాటు నడిస్తే శరీరం చురుగ్గా ఉంటుంది. రాగి పాత్రలో నీరుతాగడం అలవాటు చేసుకుంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.