close

శనివారం, ఆగస్టు 24, 2019

ప్రధానాంశాలు

భార్య ఆత్మహత్యకు కారణమైన భర్తకు ఏడేళ్ల జైలు

రంగారెడ్డిజిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: అదనపు కట్నం కోసం నిత్యం భార్యను వేధించి ఆమె బలవన్మరణానికి కారణమైన భర్తకు న్యాయస్థానం ఏడేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.5వేలు జరిమానా విధించింది. అదనపు పీపీ రాము కథనం ప్రకారం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం కావురంపేట గ్రామానికి చెందిన అప్సర్‌ జబీన్‌ వివాహం 2014 జనవరిలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రానికి చెందిన షేక్‌ ముజాహిద్‌తో జరిగింది. పెళ్లి సమయంలో ముజాహిద్‌కు అత్తింటివారు రూ.2లక్షల నగదు, 11 తులాల బంగారం, 45 తులాల వెండి, ద్విచక్రవాహనంతో పాటు ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు. మూడు నెలల తర్వాత అధిక కట్నం కోసం జబీన్‌ను భర్త ముజాహిద్‌తో పాటు మామ షేక్‌మహమ్మద్‌, అత్త షేక్‌ జులేకాబేగం నిత్యం శారీరకంగా మానసికంగా వేధించారు. దీనిని భరించలేని జబీన్‌ 2014 ఏప్రిల్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిపై భారత శిక్షాస్మృతి 304-బి(వరకట్న మృతి) నేరం కింద కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. కేసు విచారించిన సైబరాబాద్‌ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ న్యాయమూర్తి వెంకటశేషుబాబు మొదటి నిందితుడైన భర్తకు పైరకంగా శిక్ష విధించి అత్తామామను నిర్దోషులుగా తేలుస్తూ మంగళవారం తీర్పునిచ్చారు

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.