close

సోమవారం, ఆగస్టు 26, 2019

ప్రధానాంశాలు

‘సౌర’ మెట్రోరైలు

4 మెగావాట్లకు చేరిన విద్యుత్తు ఉత్పత్తి
15 శాతం కరెంటు అవసరాలు వీటితోనే
ఈనాడు, హైదరాబాద్‌

మెట్రోరైలు కాలుష్య రహిత ఇంధనం వైపు పయనిస్తోంది. సౌర విద్యుత్తుబాట పట్టింది. రోజువారీ మెట్రో అవసరాల్లో 15 శాతం వరకు పునరుత్పాదక విద్యుత్తు తీర్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. 8 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యం కాగా.. ఇప్పటివరకు మెట్రో డిపోలు, స్టేషన్లపైన సౌర పలకల ఏర్పాటుతో 3 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తోంది. మరో మెగావాట్‌ ఉత్పత్తికి సిద్ధంగా ఉంది. మిగిలిన 4 మెగావాట్ల సౌర విద్యుత్తు పనులు ఈ ఏడాది ఆఖరు వరకు పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించనుంది.

హైదరాబాద్‌ మెట్రో 72 కి.మీ. మొదటి దశ ప్రాజెక్ట్‌లో పాతబస్తీ మినహా 66 కి.మీ. పనులు చేపట్టింది. రెండు మార్గాల్లో 56 కి.మీ. ప్రయాణికులకు అందుబాటులోకి రాగా.. జేబీఎస్‌ నుంచి ఇమ్లిబన్‌ వరకు 10 కి.మీ. మార్గం పనులు చివరిదశలో ఉన్నాయి. మెట్రో మొదటి దశ పూర్తయ్యేనాటికి ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పూర్తిగా విద్యుత్తుతో నడిచే మెట్రోకి కరెంట్‌ డిమాండ్‌ పెరగనుంది. మెట్రో డిపోలు, స్టేషన్లతో పాటూ మాల్స్‌ నిర్వహణకు నిత్యం 53 మెగావాట్లపైన డిమాండ్‌ ఉంటుంది.

తాజాగా మరో మెగావాట్‌..
ఉప్పల్‌ డిపో 96 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడి నుంచి మెట్రో కార్యకలాపాలు నడుస్తుంటాయి. ఇక్కడ తాజాగా ఏర్పాటు చేసిన 1 మెగావాట్‌ సామర్థ్యం కల్గిన ప్లాంట్‌ పనులు పూర్తయ్యాయి. విద్యుత్తు ఉపకేంద్రం సిద్ధం చేశారు. వీటిని చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌(సీఈఐజీ) డీవీఎస్‌ రాజు మంగళవారం పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనుమతి రాగానే ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. దీంతో 4 మెగావాట్లకు ఉత్పత్తి సామర్థ్యం చేరుకుంటుంది. నిత్యం 18వేల యూనిట్లకు ఉత్పత్తి చేరుకుంటుంది.

కార్బన్‌ ఉద్గారాలను తగ్గిస్తుంది.. 

సంప్రదాయ విద్యుత్తు ఉత్పత్తిలో పెద్ద ఎత్తున కార్బన్‌ ఉద్గారాలు వెలువడుతూ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. వీటిని తగ్గించేందుకు పునరుద్పాదక విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం పెంచడం మేలైన మార్గం. 

  - డీవీఎస్‌ రాజు, సీఈఐజీ

మిగులు విద్యుత్తు డిపోలు..

మెట్రోరైలు ప్రాజెక్ట్‌ నిర్దేశించుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి ఇది అతిపెద్ద మైలురాయి. ఈ ఏడాది ఆఖరుకు 8 మెగావాట్ల సౌర విద్యుత్తు సామర్థ్యం చేరుకుంటాం. తాజా మెగావాట్‌ సౌర విద్యుత్తు ప్లాంట్‌తో ఉప్పల్‌ డిపో, మియాపూర్‌ డిపోలు మిగులు విద్యుత్తు డిపోలుగా మారుతాయి. 

- కేవీబీ రెడ్డి, ఎండీ, ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో రైలు.

డిపోలు, స్టేషన్లపైనే.. 

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ ఈ ప్రాజెక్ట్‌ చేపట్టింది. మెట్రో ఆపరేషన్స్‌ కోసం అవసరమయ్యే విద్యుత్తును డిస్కం నుంచి పొందుతోంది. డిస్కంపై ఆధార పడటం క్రమంగా తగ్గించుకునేందుకు సొంతంగా సౌర విద్యుత్తు ఉత్పత్తి వైపు మొగ్గుచూపింది. ప్రభుత్వం మెట్రో కోసం ముఖ్యంగా డిపోల కోసం మియాపూర్‌, ఉప్పల్‌, ఫలక్‌నుమాలో దాదాపు 217 ఎకరాలను, మెట్రో మాల్స్‌ నిర్మించేందుకు వేర్వేరు ప్రాంతాల్లో మరిన్ని స్థలాలను కేటాయించింది. స్టేషన్లలో రూఫ్‌టాప్‌పైన కిలోవాట్‌, డిపోల్లో ఖాళీజాగాల్లో మెగావాట్ల సౌర ప్లాంట్లు ఏర్పాటు వీలవుతుందని గుర్తించారు. ప్లాంట్ల ఏర్పాటుకు యాంప్‌సోలార్‌ సంస్థతో ఎల్‌ అండ్‌ టీ మెట్రో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 3 మెగావాట్ల కరెంట్‌ ఇప్పటికే ఉత్పత్తి అవుతోంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.