అంతటా అప్రమత్తత - Nizamabad - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

ప్రధానాంశాలు

అంతటా అప్రమత్తత

ఉభయ జిల్లాల్లో నిఘా పెంచిన పోలీసులు

అందరూ అందుబాటులో ఉండాలంటూ ఆదేశం

సభలు, సమావేశాలు, ర్యాలీలు నిషేధం

 

న్యూస్‌టుడే - కామారెడ్డి నేర విభాగం : కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో పోలీసులు నిఘా పెంచారు. ఎక్కడైనా అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరిగే ఆస్కారం ఉంది.. అంతటా నిఘా ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌, కామారెడ్డి ఉభయ జిల్లాల్లో పోలీసులు పూర్తి అప్రమత్తమయ్యారు.

కానిస్టేబుల్‌ నుంచి ఏసీపీ స్థాయి అధికారులందరూ అందుబాటులో ఉండాలి... తమ పరిధిలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించాలని నిజామాబాద్‌ సీపీ కార్తికేయ, కామారెడ్డి ఎస్పీ శ్వేత వేర్వేరుగా ఆదేశాలు జారీ చేశారు. కశ్మీర్‌ ప్రభావం దేశంలో ఎక్కడైనా ఉండొచ్చన్న నిఘా వర్గాల సూచనల మేరకు ప్రతి ఒక్కరు తదనుగుణంగా వ్యవహరించాలని సూచించడంతో.. సోమవారం ఠాణాల వారీగా ఎస్‌హెచ్‌వోలు, సీఐలు తమ పరిధిలో నిఘా పెంచారు.

పెట్రోలింగ్‌ ముమ్మరం

అధికారులు, సిబ్బంది రోడ్లెక్కి పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న చోట ఓ కన్నేసి ఉంచారు. కామారెడ్డి, నిజామాబాద్‌, బోధన్‌ తదితర ప్రాంతాల్లో రెండింతలు నిఘా ఉంచారు.

సెలవులు రద్దు

తాజా పరిణామాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేశారు. సెలవుల్లో వెళ్లిన వారిని వెనక్కి రప్పించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఠాణాలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

అన్నింటిపై నిషేధం

సభలు, సమావేశాలు, ర్యాలీలపై పూర్తి నిషేధాజ్ఞలు అమల్లో ఉంచారు. నిఘా, స్పెషల్‌ బ్రాంచ్‌ వర్గాల సిబ్బంది ముందస్తుగా సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. ఒకవేళ ర్యాలీలు చేపట్టాలనుకున్నా.. వారిని అప్పటికప్పుడు కట్టడి చేయనున్నారు. అవసరమైతే ముందస్తు అరెస్టులు చేపట్టనున్నారు.

ర్యాలీలు నిర్వహించరాదు: సీపీ

నిజామాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ర్యాలీలపై పూర్తి నిషేధం అమల్లో ఉందని సీపీ కార్తికేయ ప్రకటించారు. ఈ విషయంలో ప్రజలందరు సహకరించాలని కోరారు. ఆదేశాలను ఉల్లంఘించి ర్యాలీలు చేపడితే తదుపరి చర్యలకు బాధ్యులవుతారని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.