కిచెన్‌గార్డెన్‌ ప్రారంభం - Nizamabad - EENADU
close

మంగళవారం, సెప్టెంబర్ 17, 2019

ప్రధానాంశాలు

కిచెన్‌గార్డెన్‌ ప్రారంభం


కిచెన్‌గార్డెన్‌ ప్రారంభిస్తున్న పీడీ రాధమ్మ

లింగంపేట, న్యూస్‌టుడే: తల్లిపాలు శ్రేష్ఠమైనవని ఐసీడీఎస్‌ పీడీ రాధమ్మ అన్నారు. లింగంపేట మండలం ఎక్కపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం కిచెన్‌గార్డెన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ప్రథమంగా ఈ అంగన్‌వాడీ కేంద్రంలో కిచెన్‌గార్డెన్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు కూరగాయలు, ఆకుకూరలు అందించేందుకు ఈ గార్డెన్లు  ఉపయోగపడుతాయన్నారు. అనంతరం గర్భిణులకు సామూహిక సీమంతాలు చేశారు. కార్యక్రమంలో సర్పంచులు సతీష్‌గౌడ్‌, పోచయ్య, సీడీపీవో సరిత, పర్యవేక్షకురాలు స్వరూప, అంగన్‌వాడీ టీచర్‌ అనురాధ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.