బుధవారం, డిసెంబర్ 11, 2019
జాడిలో సోయాబీన్ పంటను పరిశీలిస్తున్న వ్యవసాయాధికారులు, విద్యార్థినులు
జాడిజమాల్‌పూర్, హున్సా(బోధన్ గ్రామీణం), న్యూస్‌టుడే: ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్న పలువురు విద్యార్థినులు వారి పరిశోధనలో భాగంగా వ్యవసాయాధికారులతో కలిసి బోధన్ మండలంలోని పంట పొలాలను పరిశీలించారు. శాస్త్రవేత్తలు పవన్‌చంద్రారెడ్డి, మమతకుమారి, ఇన్‌ఛార్జి ఏడీఏ సంతోష్‌కుమార్‌తో కలిసి మంగళవారం బోధన్ మండలంలోని జాడిజమాల్‌పూర్, హున్సా, సాలూర తదితర గ్రామాల్లో పర్యటించారు. సాగవుతున్న సోయాను పరిశీలించి సాగులో విధానం, సస్యరక్షణ చర్యలు, విస్తీర్ణం, దిగుబడుల గురించి తెలుసుకొన్నారు. ఇదిలా ఉండగా సోయాలో ప్రస్తుతం పచ్చపుగురు ఆశిస్తోందని, సత్వరమే నివారణ చర్యలు చేపట్టాలని రైతులు ఏడీఏకు విన్నవించారు. అధికారుల వెంట ఏఈవోలు సాయిలు, సత్తార్, రైతులు ఉన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు