పదోన్నతుల ప్రక్రియలో జాప్యం తగదు - Nizamabad - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

పదోన్నతుల ప్రక్రియలో జాప్యం తగదు

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు నార్ల అరుణ్‌కుమార్‌

బాన్సువాడ, న్యూస్‌టుడే: భాషాపండితుల పదోన్నతుల ప్రక్రియ జాప్యాన్ని నిరసిస్తూ ఈ నెల 17న హైదరాబాద్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టనున్న నిరవధిక దీక్షను విజయవంతం చేయాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ భాషా పండితుల జిల్లా అధ్యక్షుడు నార్ల అరుణ్‌కుమార్‌ గుప్తా డిమాండు చేశారు. మంగళవారం పట్టణంలోని ఓ కళాశాలలో సంఘం జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాషాభిమాని అయిన సీఎం కేసీఆర్‌ పండితుల సమస్యలను అర్థం చేసుకొని పదోన్నతులు కల్పించాలని జీవో తీసుకొచ్చారన్నారు. కొందరు కోర్టుకు వెళ్లి స్టే తీసుకురావడంతో ఆలస్యమైందన్నారు. స్టే ఎత్తివేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద నిర్వహించే దీక్షకు భాషా పండితులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి మంత్రి మధుసూదన్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ రజాక్‌, హమీద్‌, సోపాన్‌, సంజయ్‌, లాల్‌సింగ్‌, హన్మంత్‌, ప్రసాద్‌, శ్రీనివాస్‌, రాములు, సునీల్‌, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.