శనివారం, డిసెంబర్ 07, 2019
సింగీతం వాగు అవతల చిక్కుకున్న దుర్గం కిష్టయ్య
సింగీతం (నిజాంసాగర్), న్యూస్టుడే: సింగీతం వాగు అవతలి ఒడ్డున గురువారం ఉదయం సింగీతం గ్రామానికి చెందిన దుర్గం కిష్టయ్య చిక్కుకున్నాడు. వ్యవసాయ పనుల నిమిత్తం ఆయన అవతలి ఒడ్డుకు వెళ్లారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఇంటికి బయలుదేరగా ఒక్కసారిగా వాగులో నీటి ప్రవాహం పెరిగింది. ఏం చేయాలో తోచక అక్కడే కూర్చుండిపోయాడు. గ్రామస్థులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు వచ్చి పరిశీలించారు. ఈ విషయాన్ని ఎల్లారెడ్డి మండలంలోని వెంకటాపూర్లో ఉన్న కిష్టయ్య బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు ఐదు కిలో మీటర్లు అటవీ ప్రాంతంలో నడిచి వచ్చి కిష్టయ్యను సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి తీసుకువచ్చారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు సింగీతం గ్రామస్థులు వాగు ప్రవాహంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంతెన నిర్మించాలంటూ ప్రజాప్రతినిధులను మొరపెట్టుకుంటున్నా స్పందన లేదని సింగీతం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా వార్తలు