కూతురికి అల్పాహారం ఇచ్చింది.. తాను తిరిగిరాని లోకాలకు వెళ్లింది  - Hyderabad - EENADU
close

బుధవారం, సెప్టెంబర్ 18, 2019

ప్రధానాంశాలు

కూతురికి అల్పాహారం ఇచ్చింది.. తాను తిరిగిరాని లోకాలకు వెళ్లింది 

రోడ్డు దాటుతుండగా బైక్‌ ఢీకొని మహిళ మృతి

అమీర్‌పేట, న్యూస్‌టుడే: కూతురికి అల్పాహారం ఇచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఎస్సార్‌నగర్‌ ఎస్సై మహేందర్‌ వివరాల ప్రకారం అత్తాపూర్‌ సమీపంలోని కిషన్‌బాగ్‌కు చెందిన నేమల్‌రావు భార్య కె.రుక్మిణి(60) ఆదివారం ఉదయం అమీర్‌పేట చౌరస్తాలోని ఓ షాపింగ్‌ మాల్‌ సమీపంలో పనిచేస్తున్న కూతురికి అల్పాహారం తీసుకువచ్చి ఇచ్చింది. తిరిగి ప్రయాణంలో స్థానిక కనకదుర్గా ఆలయం వద్ద రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి దూసుకువచ్చిన ద్విచక్రవాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. ప్రమదానికి కారణమైన యువకుడు సందీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.