హోమియో వైద్యం.. సంపూర్ణ రోగ నివారణం  - Hyderabad - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 22, 2019

ప్రధానాంశాలు

హోమియో వైద్యం.. సంపూర్ణ రోగ నివారణం 

ఈనాడు, హైదరాబాద్‌, తార్నాక, న్యూస్‌టుడే

రోగం తగ్గాలంటే చేదు మాత్రలు మింగాల్సిందేనా..?, సూది లేకుండా మందులతో తగ్గదా..? శస్త్రచికిత్స చేయకుండా మాత్రలతోనే నయం చేయలేమా..? అల్లోపతి డాక్టర్ల వద్దకు వెళ్లే రోగులు తరచూ అడిగే ప్రశ్నలివి. మీ భయాలు ఇవే అయితే మీరు వెళ్లాల్సింది హోమియోపతి వైద్యుల వద్దకు. అవునూ! సూదులు, శస్త్రచికిత్సలతో పనిలేకుండా హోమియోపతిలో రుచిగా ఉండే మాత్రలతోనే పలు జబ్బులకు చికిత్స చేయవచ్చు అంటున్నారు వైద్యులు.

హోమియో వైద్యానికి నగరంలో క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ప్రభుత్వ వైద్య కళాశాలలే కాదు ప్రైవేటులోనూ కళాశాలల స్థాపన, పరిశోధనలతో ఆసక్తి పెరుగుతోంది. ఇటీవల కార్పొరేట్‌ క్లినిక్స్‌ రావడం, బాగా ప్రచారం చేస్తుండటంతో ముఖ్యంగా కొన్ని జబ్బుల చికిత్సకు ప్రజలు హోమియోవైపే చూస్తున్నారు. ఎక్కువగా అలర్జీలు, కీళ్లనొప్పులు, మధుమేహం వంటి జీవనశైలి జబ్బుల నివారణకు హోమియో చికిత్స తీసుకుంటున్నారని వైద్యులు తెలిపారు. డెంగీని సైతం నయం చేయవచ్చునని వైద్యులు చెబుతున్నారు. తక్కువ ఖర్చు కావడం, సిటీలో పెరిగిన క్లినిక్స్‌తోనూ అందరికి హోమియో వైద్యం అందుబాటులో ఉందంటున్నారు.

అనుభవం ఆధారంగా.. 
ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న వైద్య పద్ధతుల్లో హోమియోపతి కూడా ఒకటి. హోమియో మందులు వాడి రోగం తగ్గి ఆరోగ్యంగా ఉంటున్న వారి అనుభవాలే హోమియో వైద్యంపై విశ్వాసం పెరిగేలా చేస్తున్నాయి. ఆదివారం తార్నాకలో ఐఐసీటీ ఆడిటోరియంలో జరిగిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హోమియోపతిక్‌ ఫిజీషియన్స్‌ సదస్సుకు హాజరైన వైద్యులను ‘ఈనాడు’ పలకరించింది. 

డెంగీని నయం చేయవచ్చు  
- డాక్టర్‌ జి.జనార్దన్‌రెడ్డి, అదనపు డైరెక్టర్‌, ఆయుష్‌

చికున్‌గున్యా, డెంగీ వంటి వాటికి హోమియోలో చికిత్స ఉంది. 48 గంటల్లో తగ్గించవచ్చు. పెయిన్‌కిల్లర్స్‌ వాడటం ఉండదు కాబట్టి రక్తంలో ఫ్లెట్‌లేట్స్‌ పడిపోవడం ఉత్పన్నమే కాదు. తెల్లమచ్చలు, సోరియాసిస్‌, ఐబీఎస్‌, తలనొప్పి, సైనసైటీస్‌, ఆస్తమా వంటి వాటికి హోమియోలో మంచి వైద్యం అందుబాటులో ఉంది. వంశపారంపర్యంగా వచ్చే కొన్ని జబ్బులను నయం చేయవచ్చు. 

శస్త్రచికిత్స అవసరం లేకుండా..  
- డాక్టర్‌ కె.శివశంకర్‌, ప్రముఖ హోమియో వైద్యులు

పిల్లలు ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరం బారిన పడుతుంటారు. ఆసుపత్రికి వెళితే నెబ్యూలైజర్‌ పెడతారు. ఒకట్రెండు రోజులకే రూ.15 వేల బిల్లు అవుతుంది. హోమియోపతిలో వీటికి తక్కువ ఖర్చుతో చికిత్స ఉంది. పైగా హోమియో మందులతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తర్వాత జబ్బుల బారిన పడటం తగ్గుతుంది. 

మూలం నుంచి చికిత్స 
- డాక్టర్‌ కె.గోపాలకృష్ణ, ఐఐహెచ్‌పీ వ్యవస్థాపక సభ్యుడు 

హోమియోలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వ్యాధి లక్షణాలే కాదు వ్యక్తి లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. అల్లోపతిక్‌లో వ్యాధి తెలిస్తే చాలు అందరికి ఒకటే మందులు ఇస్తారు. ఇందులో రోగం ఏంటో తెలుసుకోవడంతోపాటు ఆ వ్యక్తి లక్షణాల ఆధారంగా మందును సూచిస్తారు. ఇందులో మూలం నుంచి చికిత్స చేస్తారు కాబట్టి మళ్లీ తిరగబెట్టడం ఉండదు. ఇటీవల హోమియోలోనూ కార్పొరేట్‌ క్లినిక్స్‌ రాకతో అవగాహన పెరిగింది. ప్రభుత్వ నుంచి సరైన ప్రోత్సాహం లేదు. ఆయుష్‌లోని ఆయుర్వేద, హోమియో, యూనానీకి కలిపి ఇచ్చే వార్షిక బడ్జెట్‌ ఒక్క గాంధీ ఆసుపత్రికి ఇచ్చే బడ్జెట్‌ అంత మాత్రమే ఉంటుంది. 

నా స్నేహితుడి ద్వారా..  
- డాక్టర్‌ లీమ్‌, మలేషియా 

నేను చాలా ఏళ్ల క్రితం జ్వరంతో బాధపడుతున్నప్పుడు నా సోదరి చైనీస్‌ మందు ఇచ్చింది. జ్వరం తొందరగా తగ్గిపోయి ఆరోగ్యం బాగు పడింది. అప్పటి నుంచి అల్లోపతిక్‌యేతర వైద్యచికిత్సపై నాకు ఆసక్తి ఏర్పడింది. అప్పుడే నా స్నేహితుడు హోమియోపతి గురించి చెప్పడంతో 2000 సంవత్సరంలో హోమియోపతి చదివాను. ఐఐహెచ్‌పీలోనే సభ్యుడిగా చేరాను. అనుభవాలను పంచుకునేందుకు ఇదో మంచి వేదిక.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.