సంక్షేమ పథకాలు.. ప్రజలకు వరాలు  - Hyderabad - EENADU
close

గురువారం, సెప్టెంబర్ 19, 2019

ప్రధానాంశాలు

సంక్షేమ పథకాలు.. ప్రజలకు వరాలు 

ఇప్పటివరకు లబ్ధిదారులకు అందిన నిధులు  రూ.47 కోట్లు 
సీఎం సహాయనిధి అందజేతలో రాష్ట్రంలోనే లష్కర్‌ ప్రథమం 
పింఛన్‌దారులకు ఏటా రూ.40.3 కోట్లు

* ‘బౌద్ధనగర్‌కు చెందిన గగన్‌దీప్‌ అనే చిన్నారి క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ బసవతారక క్యాన్సర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుసుకున్న మంత్రి వెంటనే రూ.5 లక్షలను మంజూరుచేయించి అందించారు.’ 
* ‘వారాసిగూడకు చెందిన ఓ కుటుంబం ఉత్తర భారత దేశ పర్యటనకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో వారి వాహనం ప్రమాదానికి గురైంది.వారిలో ఆఫ్రాపాతిమా తీవ్ర గాయాలపాలైంది. ఆమెకు చికిత్స చేసేందుకు రూ.5 లక్షలు అవసరమయ్యాయి. ఆర్థిక సాయం కోసం సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపసభాపతి టి.పద్మారావును కలిశారు. ఆయన సూచన మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా రూ.5 లక్షలు మంజూరయ్యాయి.దీంతో ఆమెకు మెరుగైన వైద్యం పొంది కోలుకుంది’

న్యూస్‌టుడే, సికింద్రాబాద్‌

ఇలా నియోజకవర్గంలోని పేదలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడేసేందుకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయుక్తంగా ఉంటోంది. ఆరోగ్యశ్రీ కార్డు లేని పేదలకు ఈ అవకాశం వారి ప్రాణాలను కాపాడేందుకు దోహదపడుతోంది. ఆరోగ్యశ్రీ పథకం వర్తించేవారు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలను పొందుతున్న తరహాలోనే అర్హులైన పేదలకు సీఎం రిలీఫ్‌ఫండ్‌ ఉపయోగపడుతోంది. అందుకోసం పద్మారావు తన వద్దకు వచ్చిన వారికి సహాయం అందిస్తూ అండగా నిలుస్తున్నారు. .

ఇప్పటివరకు రూ.32 కోట్లకు చేరిన సహాయం 
గతంలోనూ ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఉన్నప్పటికీ దాన్ని వినియోగించుకున్న సందర్భాలు అంతగా వెలుగులోకి రాలేదు. తెరాస ప్రభుత్వం వచ్చాక ఆ నిధి ద్వారా చాలామంది వ్యాధుల నుంచి బయటపడుతున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివిధ సందర్భాల్లో ఈ పథకాన్ని వినియోగించుకోవాలని చెప్పడమేగాకుండా, పార్టీ  శ్రేణులకు కూడా మీ ప్రాంతాల్లో డబ్బులేక రోగాలతో బాధపడుతున్నవారిని గుర్తించి సీఎం సహా నిధి నుంచి డబ్బు ఇప్పించేలా కృషిచేయాలని సూచించారు. ఆరోగ్యశ్రీ కార్డు లేనివారు, దానికి అర్హతలేనివారు వైద్యానికి డబ్బు అవసరమైతే తన కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని, తప్పకుండా సాయం అందించేలా కృషిచేస్తానని తరచూ ప్రకటిస్తుండడం వల్ల అలాంటి వారి సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోంది. నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో కొంత నత్తనడకగా ఉన్నప్పటికీ పేద, మధ్యతరగతి ప్రజలు వ్యాధులకు గురైతే సీఎం నిధి అందించి వారికి అండగా పద్మారావు నిలుస్తున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం కొనసాగుతూ తాజాగా రూ.32 కోట్ల వరకు సహాయాన్ని అందించి రాష్ట్రంలోనే ప్రథమంగా నిలిచారు.

పేదల కష్టాలు తెలిసివారే ఉన్నారు 
- పద్మారావు, రాష్ట్ర ఉపసభాపతి 

ప్రభుత్వంలో పేదల కష్టాలు తెలిసినవారే అత్యధికంగా ఉన్నందు వల్ల నిస్వార్థంగా వారి సంక్షేమానికే కృషి చేస్తున్నాం. పేదల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకుగాను ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రులను సదుపాయాలతో తీర్చిదిద్దుతోంది. అయినా కొంతమంది పేదలకు అత్యవసరంగా కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందడం కూడా అనివార్యమైంది. ఖరీదైన వైద్యానికి డబ్బు లేని పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నాం.

మిగతా పథకాల్లోనూ ముందంజలోనే.. 
ఇతర ప్రభుత్వ పథకాలను కూడా అర్హులైన వారికి అందిస్తుండడంలోనూ ముందంజలోనే ఉన్నారు. 2014 నాటికి అన్ని రకాల పింఛనుదారులు 6 వేల వరకు ఉండేవారు. వారందరికీ నెలవారి పింఛన్లు వచ్చేవి కాదు. పింఛన్ల కోసం తమను సంప్రదించాలని కోరడంతో దశలవారీగా దరఖాస్తు చేసుకోగా తాజాగా అన్ని రకాల పింఛనుదార్లు 15,444 మంది ఉన్నారు. వారందరికీ ప్రతినెల  రూ.3.36 కోట్లు అందిస్తుండగా, ఏడాదికి రూ.40.3 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు ఇప్పటివరకు నియోజకవర్గంలో 1750 మందిని లబ్ధిదారులుగా గుర్తించి సుమారు రూ.15 కోట్లు అందజేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.