వినాయక చవితి ఉత్సవాలకు శ్రీకారం - East%20Godavari - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 22, 2019

ప్రధానాంశాలు

వినాయక చవితి ఉత్సవాలకు శ్రీకారం


పందిరిరాట పూజలో పాల్గొన్న ఎంపీ చింతా అనూరాధ, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు 

అయినవిల్లి: సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో చవితి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఎంపీ చింతా అనూరాధ, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సూచించారు. సెప్టెంబర్‌ రెండు నుంచి జరగనున్న వినాయక నవరాత్రోత్సవాలకు ఆదివారం ఆలయంలో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు. భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ అర్చకుల వేదమంత్రోచ్చారణల మధ్య పందిరిరాటకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం పలువురు భక్తులకు ఉచితంగా స్వామి వారి మట్టి ప్రతిమలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పి.టి.వి.వి.సత్యనారాయణమూర్తి, వాసంశెట్టి తాతాజీ, గుత్తుల నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.