సీఎం పర్యవేక్షణలోనే వాలంటీర్ల వ్యవస్థ - East%20Godavari - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

సీఎం పర్యవేక్షణలోనే వాలంటీర్ల వ్యవస్థ

ఉప ముఖ్యమంత్రి సుభాష్‌చంద్రబోస్‌


సమావేశంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి బోస్‌ 

మండపేట, న్యూస్‌టుడే: ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించినది కావడంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను తన పర్యవేక్షణలో ఉంచుకున్నారని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ పేర్కొన్నారు. ఆదివారం మండపేటలోని రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ హాల్‌లో పురపాలక కమిషనర్‌ టి.రాంప్రసాద్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వార్డు వాలంటీర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేస్తే వెంటనే ఆ ఫిర్యాదు సంబంధిత కలెక్టరుకు చేరుతుందన్నారు. ఆయన విచారణ జరిపి 48 గంటల్లో ప్రభుత్వానికి నివేదిక పంపుతారని చెప్పారు. అవకతవకలకు పాల్పడినట్లు తేలితే వెంటనే తొలగించే అవకాశం ఉందన్నారు. లబ్ధిదారుల ఎంపికలో కులం, మతం, పార్టీలు, బంధువులు, స్నేహితులు అన్నది చూడకూడదని, వారి పేదరికం మాత్రమే చూడాలన్నారు. ఉగాది నాటికి ఎంపిక చేసిన లబ్ధిదారులకు నివేసన స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. లబ్ధిదారుల ఎంపికలో నిస్వార్థంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. అమలాపురం పార్లమెంటు సభ్యురాలు చింతా అనూనాధ మాట్లాడుతూ వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలన్నారు. ప్రస్తుతం గౌరవ వేతనం ఇచ్చినా భవిష్యత్తులో శాశ్వత ఉద్యోగంగా మార్చే అవకాశాలు ఉన్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌదరి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా పేదల ఇళ్ల కోసం 123 ఎకరాలు సేకరించామన్నారు. వాటిలో ప్రస్తుతం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద నిర్మించిన ఇళ్లకు ఎక్కువ ధర పెట్టడంతో పాటు సరైన ప్రమాణాలు పాటించలేదని విమర్శించారు. పురపాలక సంఘం కమిషనర్‌ టి.రామ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా వాలంటీర్లు పని చేయలాన్నారు. ఈ సమావేశంలో వైకాపా నాయకులు రెడ్డి రాధాకృష్ణ, కర్రి పాపారాయుడు, సొసైటీ అధ్యక్షుడు కుక్కల రామారావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.