ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం ఉద్యమం   - Kadapa - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

ప్రధానాంశాలు

ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం ఉద్యమం  

కడప విద్య, న్యూస్‌టుడే: ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం విద్యార్థి లోకం ఉద్యమించాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి యువజన సంఘం (ఏపీఎస్‌వైఎఫ్‌) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జయవర్ధన్‌, సుబ్బరాయుడు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక శారద నర్సింగ్‌ కళాశాలలో ఏపీఎస్‌వైఎఫ్‌ నగర మొదటి మహాసభ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్య పూర్తిగా నిర్లక్ష్యానికి గురయిందన్నారు. నూతన ప్రభుత్వం పత్రికా ప్రకటనలకే పరిమితమయిందన్నారు. ఉన్నతవిద్య అభివృద్ధే లక్ష్యంగా దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తీసుకువచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రస్తుతం కుంటుపడిందన్నారు. గత విద్యా సంవత్సరం నుంచి ఇంతవరకూ విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ అందలేదన్నారు. హాస్టల్‌లో చదివే విద్యార్థులకు కాస్మొటిక్‌, మెస్‌ఛార్జీలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాలలో ప్రధాన అంశాలైన విద్య, వైద్యం ఉపాధి అవకాశాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా మూసివేసిన 900 ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలను తిరిగి ప్రారంభించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రూ.2500 మెస్‌, కాస్మొటిక్‌ ఛార్జీలు పెంచి సన్నబియ్యంతో ప్రభుత్వం భోజనం అందించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సంఘం నూతన నగర కమిటీని ఎన్నుకున్నారు. నగర అధ్యక్షులుగా షేక్షావలి, కార్యదర్శిగా చందు, ఉపాధ్యక్షులుగా గోపి, మణికుమార్‌, చందు, సహాయ కార్యదర్శులుగా వెంకట రమణ, రాజా, మనోహర్‌, కమిటీ సభ్యులుగా తరుణ్‌, చెండ్రాయుడు, విక్రమ్‌ తదితరులను ఎన్నుకున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.