మొక్కల సంరక్షణను బాధ్యతగా స్వీకరించాలి: సీఈవో - Bhadradri - EENADU
close

గురువారం, సెప్టెంబర్ 19, 2019

ప్రధానాంశాలు

మొక్కల సంరక్షణను బాధ్యతగా స్వీకరించాలి: సీఈవో

ఆళ్లపల్లి, న్యూస్‌టుడే: హరితహారంలో భాగంగా మండలంలో నాటిన మొక్కల సంరక్షణను బాధ్యతగా స్వీకరించాలని భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయ సీఈవో మధుసూదన్‌రాజు పేర్కొన్నారు. మండల ప్రజాపరిషత్‌ కార్యాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. నూతన ప్రజాపరిషత్‌ పాలక మండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఉపాధి టీఏలు, గ్రామ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండలంలోని ప్రతి ఇంటా మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామాల్లోని అంతర్గత రహదారులకు ఇరువైపులా డ్రైనేజీలను శుభ్రపరుచుకునేలా చర్యలను చేపట్టాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. గ్రామల్లో బ్లీచింగ్‌, ఫాగింగ్‌ చేపట్టేందుకు గ్రామ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. గతంలో గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫాగింగ్‌ మిషన్‌ మరమ్మతులను తక్షణమే చేపట్టి, గ్రామల్లో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆళ్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రజాప్రతినిధులతో కలిసి హరితహారం మొక్కలను నాటారు. ఎంపీడీవో కనపర్తి ఈదయ్య, ప్రజాపరిషత్‌ మండలాధ్యక్షురాలు కొండ్రు మంజు భార్గవి, ఉపాధ్యాక్షులు రేసు ఎల్లయ్య, జడ్పీటీసీ సభ్యులు కొమరం హన్మంతరావు, సర్పంచి మెస్సు కోటేశ్వరరావు, గ్రామ కార్యదర్శులు, వార్డు సభ్యులు వివిధ రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.