విజ్ఞానం.. వికాసం - Bhadradri - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

ప్రధానాంశాలు

విజ్ఞానం.. వికాసం

వినూత్న ప్రయోగాల ఆవిష్కరణ

ఆకట్టుకున్న బాలల వైజ్ఞానిక ప్రదర్శన

మాట్లాడుతున్న జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి

పాల్వంచ సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఔరా అనిపించే ఆలోచన.. అబ్బురపరిచే ప్రదర్శన.. అడుగడుగునా సృజన.. అంతకుమించి సామాజిక విస్తృత ప్రయోజన.. బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ వేదికగా ఆవిష్కృతమైంది. జిల్లావ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టి తయారు చేసిన నమూనాలను ప్రదర్శించారు. జిల్లాస్థాయి బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ వైజ్ఞానిక ప్రదర్శనను మంగళవారం పాల్వంచ గిరిజన బాలుర ఉన్నత పాఠశాలలో డీఈవో వాసంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. పాఠశాల స్థాయిలోనే ప్రయోగాలకు పెద్దపీట వేయాలనే మాటను నిజం చేస్తూ బాలలు తమలోని ప్రతిభ చాటారన్నారు. జిల్లావ్యాప్తంగా ఆయా పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు 155 ప్రాజెక్టులను తయారు చేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ జిల్లా సమన్వయకర్త సంపత్‌కుమార్‌, జిల్లా సైన్స్‌ అధికారి చలపతిరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నందా తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు

ఆరోగ్యకరమైన దేశం కోసం..:

విద్యార్థిని: కీర్తన

పాఠశాల: ఏజీహెచ్‌ఎస్‌ అంకంపాలెం

ప్రయోజనం: పచ్చదనాన్ని పెంపొందించడంతోపాటు ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి, ఇంకుడుగుంత తప్పని సరిగా ఉండాలని ప్రయోగాత్మకంగా ప్రదర్శించింది. ఇంటి ఆవరణలో నిత్యం పరిసరాల పరిశుభ్రత కచ్చితంగా పాటిస్తే ఆరోగ్యకరమైన దేశంగా మార్చవచ్చని ప్రాజెక్టు రూపంలో తెలిపారు. ఫలితంగా రోగాలు దరిచేరవని నిరూపించారు.

చెత్త నుంచి విద్యుదుత్పత్తి

విద్యార్థి: పి.యోగేందర్‌

పాఠశాల: జడ్పీఎస్‌ఎస్‌ పినపాక పట్టినగర్‌

ప్రయోజనం: పరిసర ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోతుంది. ఫలితంగా వ్యాధులు ప్రబలుతున్నాయి. చెత్త ద్వారా విద్యుత్తు తయారు చేసుకోవచ్ఛు ఇనుప కడ్డీలను చెత్తలో వేసి, దాంట్లో పదార్థం వేసిన కొద్దిసేపటికి కరిగి విద్యుత్తు ఉత్పతి అవుతుందని నిరూపించారు.

స్వచ్ఛ పాఠశాల..

విద్యార్థినులు: ఆర్‌.నవ్య , పి.నవ్య

పాఠశాల: ఏజీహెచ్‌ఎస్‌ గొల్లగూడెం, దమ్మపేట

ప్రయోజనం: స్వచ్ఛ భారత్‌లో భాగంగానే స్వచ్ఛ పాఠశాల నిర్వహిస్తున్నారు. ప్రతి పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని శుక్ర, శనివారాల్లో నిర్వహించడం వల్ల పాఠశాల, పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేటట్లు చేయడం, హరితహారంలో వీలైనన్ని మొక్కలు నాటడం వలన విద్యాలయాల్లో కాలుష్యం నివారించి విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చనే అంశాలను ప్రాజెక్టు రూపంలో వివరించారు.

వర్షపు నీటిని సంరక్షించాలి..

విద్యార్థులు: శ్రీధర్‌ , భావ్‌సింగ్‌

పాఠశాల: బాలుర ఆశ్రమ పాఠశాల , పాల్వంచ

ప్రయోజనం: భూగర్భ జలాలను నిండుగా ఉండేలా చేసుకోవాలి. చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి నీటి చుక్క భూమిలో ఇంకేలా ఇంకుడుగుంత నిర్మించుకోవాలి. ఫలితంగా భూగర్భజలాలు మెరుగుపడతాయనే అంశాన్ని ఇతర లాభాలను ప్రాజెక్టు రూపంలో తెలిపారు.

కాలుష్యాన్ని తగ్గించే ఆలోచన

విద్యార్థినులు: రోజా, పద్మవతి

పాఠశాల: జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాల , భద్రాచలం

ప్రయోజనం: ప్రపంచాన్ని ఆవరించి, ప్రజారోగ్యాన్ని కబళిస్తున్న కాలుష్యం తగ్గించే అంశాన్ని ప్రాజెక్టు రూపంలో వివరించారు. చెట్లను అధికంగా పెంచి, ఆక్సిజన్‌ ఇచ్చే మొక్కలను పెంచాలి. కర్మాగారాలు, వాహనాల నుంచి శబ్ద, వాయు కాలుష్యం నానాటికీ పెరిగిపోతుంది. దీనికి నివారణగా మొక్కల పెంపకం మేలు. అనే అంశాన్ని వివరించారు.

విద్యుత్తు వృథాను అరికట్టేందుకు..

విద్యార్థినులు: కల్యాణి, అనుష

పాఠశాల: ఆశ్రమ పాఠశాల , దుమ్ముగూడెం

ప్రయోజనం: ఎల్‌ఆర్‌డీ విధానం ద్వారా వీధిదీపాలు వాటంతటా అవే ఆరిపోవడం, వెలిగే అంశాన్ని ప్రాజెక్టు రూపంలో వివరించారు. దీని ద్వారా విద్యుత్తు వల్ల కలిగే ప్రమాదాలను నివారించవచ్ఛు తక్కువ ఖర్చుతో వీటిని ఏర్పాటు చేయవచ్ఛు ఫలితంగా విద్యుత్తు ఆదా అవుతోంది. ప్రయోజనం చేకూరుతుందని ప్రాజెక్టు రూపంలో వివరించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.