రాజధాని మార్పు సీఎం నిర్ణయమే.. - Kurnool - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

రాజధాని మార్పు సీఎం నిర్ణయమే..

● తెదేపా హయాంలో అమరావతిలో రూ.2 వేల కోట్లు ఖర్చు

ఏదీ ఉపయోగపడే విధంగా లేదు ● ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే విమర్శ


అంగన్‌వాడీ భవనాలు ప్రారంభిస్తున్న మండలి విప్‌, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

చాగలమర్రి, న్యూస్‌టుడే: చాగలమర్రి పట్టణంలో రూ.15 లక్షలతో నూతనంగా నిర్మించిన రెండు అంగన్‌వాడీ భవనాలను శాసన మండలి విప్‌, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి గురువారం ప్రారంభించారు. పట్టణానికి చేరుకున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు వైకాపా శ్రేణులు గజ మాలలతో స్వాగతం పలికారు. అనంతరం అంగన్‌వాడీ భవనాలను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో గుడ్ల సమస్య ఉందని, ఈ విషయాన్ని కలెక్టరు దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు. పెండింగ్‌లో ఉండే అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అమరావతిలో రూ.2 వేల కోట్ల వరకు ఖర్చు చేశారు. అందులో నిర్మించిన వాటిలో ఒక్కటైనా పనికొచ్చేలా ఉన్నాయా అని ప్రశ్నించారు. ఒక్కటి కూడా శాశ్వత పనులు చేయలేదని ఆయన ఆరోపించారు. వరద ముంపునకు గురవుతాయని తెలిసికూడా భవనాలు నిర్మించుకుని ఈ రోజు ప్రభుత్వంపై బురదజల్లడం సమంజసం కాదన్నారు.అమరావతి మార్పు విషయం పూర్తిగా ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. సీమ వాసి అయిన మాజీ ముఖ్యమంత్రి విభజన సమయంలో కర్నూలును రాజధానిగా చేయవచ్చని అప్పటి ప్రభుత్వాన్ని నిలదీశారన్నారు. సీమ ప్రజలకు చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. చాగలమర్రిలోని పెద్దమకానం వీధిలో బీసీ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ప్రారంభించారు. బీసీల సంక్షేమమే వైకాపా ప్రభుత్వ ధ్యేయమన్నారు. స్థానిక నాయీబ్రాహ్మణ కాలనీకి చెందిన తెదేపా నేత, భూమా వర్గీయులు ఖాజా ఉసేన్‌తో పాటు మరో 15 మంది నాయకులు వైకాపాలో చేరారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.