ప్రతి శుక్రవారం హరితమే - Hyderabad - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

ప్రధానాంశాలు

ప్రతి శుక్రవారం హరితమే

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ప్రతి శుక్రవారాన్ని హరిత శుక్రవారంగా పాటించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. నగరవాసులకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేయాలని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ ఎం.దానకిషోర్‌ ఆదేశాలు జారీ చేశారు.
* ప్రతి శుక్రవారం అన్ని స్వచ్ఛఆటోలు, ఎంటమాలజి, అర్బన్‌ బయోడైవర్సిటీ, ఇంజినీరింగ్‌ విభాగాల వద్ద ఉన్న వాహనాల ద్వారా నర్సరీల నుంచి మొక్కలు తరలించి ఇంటింటికి పంపిణీ చేయాలి.
* ప్రాంతీయ కమిటీలు, వార్డు కమిటీల సభ్యులు, స్వయం సహాయక మహిళలు, సీనియర్‌ సిటిజన్లను హరితహారంలో భాగస్వామ్యం చేయాలి.
* నగరంలోని నిర్ణయించిన ఖాళీ స్థలాల్లో హరితహారం మొక్కలను పెద్దఎత్తున నాటే కార్యక్రమంలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పాల్గొనేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
* మాన్సూన్‌ మానిటరింగ్‌ పర్యవేక్షక అధికారులుగా నియమితులైన అదనపు కమిషనర్లు, హెచ్‌.ఓ.డిలు తమకు కేటాయించిన సర్కిళ్లలో హరితహారంలో పాల్గొనాలి.
* ప్రతి శుక్రవారం ఒక్కో సర్కిల్‌లో కనీసం 50వేల మొక్కలను నాటడం, ఉచితంగా పంపిణీ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి.  నాటే మొక్కలు అన్నింటికి జియోట్యాగింగ్‌ను చేపట్టాలి.
* డిప్యూటి కమిషనర్లు, ఇతర విభాగాల సమన్వయంతో హరితహారం కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు అర్బన్‌ బయోడైవర్సిటీ అధికారులు కార్యక్రమాన్ని రూపొందించాలి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.