నగర వ్యాప్తంగా అధునాతన ఫంక్షన్‌హాళ్లు - Hyderabad - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

నగర వ్యాప్తంగా అధునాతన ఫంక్షన్‌హాళ్లు

సికింద్రాబాద్‌, న్యూస్‌టుడే: జంటనగరాల వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అధునాతన సదుపాయాలు కలిగిన బహుళ ప్రయోజన ఫంక్షన్‌హాళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ అన్నారు. ఈ ప్రక్రియలో ప్రజాప్రతినిధులు సహకరించాలని అన్నారు. గురువారం సీతాఫల్‌మండి డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉపసభాపతి పద్మారావుతో కలిసి పర్యటించిన కమిషనర్‌ సీతాఫల్‌మండిలోని మల్టీపర్పస్‌ ఫంక్షన్‌హాల్‌, సెట్విన్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో నెల రోజుల్లో ఈ హాలును ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆయన సర్కిల్‌ అధికారులను ఆదేశించారు. తాము వ్యక్తిగతంగానూ సహకరిస్తున్నామని పద్మారావు పేర్కొన్నారు. కార్పొరేటర్‌ సామల హేమ, డీసీ రవికుమార్‌, విజయరావు, రాజశేఖర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.