హెచ్‌సీయూ సహాయ ఆచార్యుడికి యువశాస్త్రవేత్త పురస్కారం - Hyderabad - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

హెచ్‌సీయూ సహాయ ఆచార్యుడికి యువశాస్త్రవేత్త పురస్కారం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యుడిగా పనిచేస్తున్న డాక్టర్‌ మురళి బాణావత్‌కు ప్రతిష్ఠాత్మక జాతీయ సైన్స్‌ అకాడమీ (నాసి).. ‘యంగ్‌ సైంటిస్ట్‌ ప్లాటినమ్‌ జూబ్లీ అవార్డు-2019’ దక్కింది. 35 ఏళ్లలోపు యువశాస్త్రవేత్తలకు ఈ అవార్డును నాసి అందిస్తుంది. సౌరశక్తి విభాగంలో మురళి చేసిన పరిశోధనకుగాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. గతంలోనూ మురళికి పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు దక్కాయి. 2017లో బ్రిక్స్‌ దేశాల యువ శాస్త్రవేత్త పురస్కారం, గతేడాది మార్చిలో 105వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశం సందర్భంగా యువశాస్త్రవేత్త అవార్డులు అందుకున్నారు.

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.