హిందూ మతం స్వీకరించిన అన్యమతస్థులు - Kurnool - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

హిందూ మతం స్వీకరించిన అన్యమతస్థులు

కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్‌

శ్రీశైలం న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలో పలువురు అన్యమతస్థులు హిందూమతం స్వీకరించినట్లు రాష్ట్ర భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రీనివాస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. గతంలోనూ 100 మందికి పైగా హిందూమతాన్ని స్వీకరించేందుకు తమ వంతు కృషి చేసినట్లు చెప్పారు. క్షేత్రపరిధిలో అన్యమతస్థులు ఉండకూడదన్న సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్‌ తెలిపారు. శుక్రవారం పలువురు యువకులకు స్వామి, అమ్మవార్ల కుంకుమ, విభూదిలను అందజేసి కండువాలను కప్పి హిందూమతంలోకి చేర్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానికులు సవమ్మ, అంకయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.