ముఖ్యమంత్రి చిత్రపటం తప్పనిసరి - Kurnool - EENADU
close

గురువారం, సెప్టెంబర్ 19, 2019

ప్రధానాంశాలు

ముఖ్యమంత్రి చిత్రపటం తప్పనిసరి
కలెక్టర్‌కు సీఎం చిత్రపటాన్ని అందజేస్తున్న సమాచారశాఖ డీడీ తిమ్మప్ప
 

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాన్ని ప్రదర్శించాలని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆమోదంతో రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్‌ టి.విజయకుమార్‌రెడ్డి పంపిన సీఎం ఫొటో ఫ్రేమ్‌లను సమాచారశాఖ డీడీ తిమ్మప్ప శుక్రవారం కలెక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి అధికారిక ఫొటోను అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అధికారిక కార్యక్రమాల్లో తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ కాన్ఫరెన్సు హాలు, వీడియో కాన్ఫరెన్సు హాలు, సమాచార శాఖ కార్యాలయంలో సీఎం ఫొటోలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రెండో జేసీ ఖాజా మొహిద్దీన్‌, డీఆర్వో వెంకటేశం, జిల్లా అధికారులు, డివిజనల్‌ పీఆర్‌వో మల్లికార్జున, ఏవీఎస్‌ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.