పీఎం కిసాన్‌ మాన్‌ ధన్‌ యోజనలో 1007 మంది నమోదు - Chittoor - EENADU
close

బుధవారం, సెప్టెంబర్ 18, 2019

ప్రధానాంశాలు

పీఎం కిసాన్‌ మాన్‌ ధన్‌ యోజనలో 1007 మంది నమోదు

చిత్తూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పీఎం కిసాన్‌ మాన్‌ ధన్‌ యోజనపై గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్‌ శనివారం తెలిపారు. ఈ పథకానికి 18-40ఏళ్ల లోపు వయస్సు కలిగిన చిన్న, సన్నకారు రైతులు అందరూ అర్హులని చెప్పారు. ప్రీమియం మొత్తంలో కేంద్ర ప్రభుత్వం 50శాతం చెల్లిస్తుందని, మిగిలిన మొత్తాన్ని రైతులు నెలవారీగా చెల్లించాలన్నారు. ఈ పథకంలో నమోదైన రైతులకు 60ఏళ్ల తర్వాత నెలకు రూ.3వేలు పింఛన్‌ పొందే అవకాశం ఉందన్నారు. పింఛన్‌ చెల్లింపునకు ఎల్‌ఐసీ బాధ్యత వహిస్తుందన్నారు. జిల్లాలో ఈ పథకానికి సుమారు 50వేల మంది రైతులు అర్హులని.. వారికి సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం వ్యవసాయశాఖకు నివేదించిందన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 1,007 మంది రైతులు ఈ పథకంలో నమోదు చేసుకున్నారని చెప్పారు. అర్హులైన రైతులు స్వచ్ఛంద నమోదుతో ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు రైతులు మండల వ్యవసాయాధికారులు, సిబ్బందిని సంప్రదించాలన్నారు.దీనిపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి అర్హులైన రైతులందరూ నమోదు చేసుకునేలా వ్యవసాయాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.