ఆశా కార్యకర్తల ముందస్తు అరెస్టు.. విడుదల - Chittoor - EENADU
close

శనివారం, సెప్టెంబర్ 21, 2019

ప్రధానాంశాలు

ఆశా కార్యకర్తల ముందస్తు అరెస్టు.. విడుదల
అరెస్టు చేసిన ఆశా కార్యకర్తలతో పోలీసులు
చిత్తూరు(వైద్యవిభాగం), న్యూస్‌టుడే: వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే ఆశా కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారం కోసం చలో విజయవాడ కార్యక్రమానికి బయలుదేరిన నేపథ్యంలో వారిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఆపై సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఆశా కార్యకర్తలకు నెలకు రూ.10 వేల వేతనం చెల్లించేలా ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం విదితమే. అయితే.. అందులో కొన్ని నిబంధనలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని.. గ్రేడింగ్‌ ఆధారంగా జీతాలు చెల్లించడమే కాకుండా, గ్రేడింగ్‌లో మార్కులు తగ్గితే తమను తొలగించేలా షరతులు ఉండటంతో వారు చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టారు. సోమవారం జరిగే ఈ కార్యక్రమానికి బయలుదేరినవారిని పోలీసులు ఎక్కడికక్కడే ముందస్తుగా అరెస్టు చేశారు. కొందరిని ఇంటి నుంచి వెళ్లకుండా పోలీసులు సాయంత్రం వరకు వారివారి ఇళ్ల వద్దే నిఘా పెట్టారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 200మంది కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేసి సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

 

ముందస్తు అరెస్టు దారుణం..: ప్రభుత్వం వైఖరిని నిలదీసి న్యాయం కోసం పోరాడేందుకు బయలుదేరిన ఆశా కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం దారుణమని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య పేర్కొన్నారు. సీఎం జగన్‌ తన పాదయాత్ర సమయంలో ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం సరికాదన్నారు. జీవోలు ఇచ్చి వాటిలో వ్యతిరేక నిబంధణలు పెట్టడం సమంజసం కాదన్నారు. వాటిని ప్రశ్నించి, న్యాయం కోసం పోరాడేందుకు బయలుదేరిన వారిని అడ్డుకోవడం అన్యాయమని.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆశా కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.