ఆట.. పాటలతో బోధన - Vikarabad - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 15, 2019

ప్రధానాంశాలు

ఆట.. పాటలతో బోధన

ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ

బలోపేతం కానున్న విద్యాలయాలు

న్యూస్‌టుడే, వికారాబాద్‌ టౌన్‌
 

పాఠ్యాంశాలను ఆటపాటలతో బోధించడం వల్ల త్వరగా అర్థం చేసుకోవడంతో పాటు నేర్చుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతారు. రేపటిపౌరులను అన్ని విధాలుగా తీర్చిదిద్దేందుకు ప్రస్తుతం ఉన్న విధానంలో కాకుండా వినూత్న బోధన చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఉపాధ్యాయులకు ‘జాయ్‌ఫుల్‌ లెర్నింగ్‌’ అనే పేరుతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి సర్కారు శ్రీకారం చుట్టింది.

ప్రభుత్వ బడులను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. నిపుణులైన ఉపాధ్యాయుల ద్వారా బోధన చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మార్చేందుకు, ఉపాధ్యాయుల్లో మరింత నైపుణ్యాన్ని పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఒక రోజు ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఇందులో జిల్లా నుంచి ఐదు మంది పాల్గొన్నారు. విడతల వారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల వారికి శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1,011 ఉన్నాయి. వీటిల్లో చదువుతున్న విద్యార్థులు అన్నింటా రాణించేలా నూతన విధానం ఉపయోగపడనుంది.

విద్యార్థులు రాణించేందుకు ఉపయోగపడుతుంది

-రేణుకాదేవి, డీఈఓ

మొదటగా ఐదు మంది ఉపాధ్యాయులు శిక్షణకు వెళ్లారు. జిల్లా వ్యాప్తంగా అందరికీ శిక్షణ కల్పించనున్నాం. ఆట, పాటలతో బోధన చేయడం ద్వారా విద్యార్థులు ఆసక్తిగా వింటారు. నిత్యం పాఠశాలకు వచ్చే అవకాశం ఉంటుంది. హాజరు శాతం పెరుగుతుంది. మెరుగుకు ఉపయోగపడుతుంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.