చంద్రగిరి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి సస్పెన్షన్‌ - Chittoor - EENADU
close

శనివారం, సెప్టెంబర్ 21, 2019

ప్రధానాంశాలు

చంద్రగిరి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి సస్పెన్షన్‌

ఎస్‌ఐ వేధింపుల ఆరోపణలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: చంద్రగిరి మండలం పరిధిలోని ముంగిలిపట్టు గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి కారణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ రామకృష్ణారెడ్డిని అర్బన్‌ జిల్లా ఎస్పీ కె.కె.ఎన్‌.అన్బురాజన్‌ సస్పెండ్‌ చేశారు. ఇటీవల ముంగిలిపట్టుకు చెందిన రమేష్‌బాబు అనే యువకుడిని ఓ నేరంలో ఎస్‌ఐ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విడిచిపెట్టారు. అయితే ఎస్‌ఐ తాను ఏ నేరం చేయకపోయినా స్టేషన్‌కు తీసుకెళ్లి దారుణంగా కొట్టారని ఫేస్‌బుక్‌ వీడియోలో యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ అవమానాన్ని తాళలేక ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నానని తనను వేధింపులకు గురిచేసిన ఎస్‌ఐపై తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రమేష్‌బాబును కుటుంబసభ్యులు తిరుపతిలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐ రామకృష్ణారెడ్డిని ఎస్పీ సస్పెండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.