ఉమ్మడి జిల్లాకు ఎస్‌జీఎఫ్‌ క్రీడా టోర్నీల కేటాయింపు - Jogulamba - EENADU
close

శనివారం, సెప్టెంబర్ 21, 2019

ప్రధానాంశాలు

ఉమ్మడి జిల్లాకు ఎస్‌జీఎఫ్‌ క్రీడా టోర్నీల కేటాయింపు

మహబూబ్‌నగర్‌ క్రీడలు, న్యూస్‌టుడే : పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్‌) రాష్ట్ర కార్యదర్శి రాంరెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు అండర్‌-14, 17, 19 క్రీడా టోర్నీలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్‌జీఎఫ్‌ అండర్‌-19 కార్యదర్శి పాపిరెడ్డి, అండర్‌-14, 17 కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి ఆదివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. అండర్‌-19లో రెండు జాతీయస్థాయి పోటీలు, 7 రాష్ట్రస్థాయి పోటీలు కేటాయించగా, అండర్‌-14, 17లో మూడు జాతీయస్థాయి పోటీలు, 5 రాష్ట్రస్థాయి పోటీలను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అండర్‌-19 జాతీయస్థాయి టెన్నీకాయిట్‌ బాల, బాలికలు, సూపర్‌ సెవన్‌ క్రికెట్‌ టోర్నీలను, అండర్‌-14 హాకీ బాల, బాలికలు, అండర్‌-17 టెన్నీకాయిట్‌ బాల, బాలికలు, అండర్‌-17 క్రికెట్‌ బాలికల జాతీయస్థాయి టోర్నీలను ఉమ్మడి జిల్లాకు మంజూరు చేసినట్లు వారు తెలిపారు. అండర్‌-19 రాష్ట్రస్థాయి బీచ్‌ వాలీబాల్‌, కబడ్డీ బాల, బాలికలు, ఫుట్‌బాల్‌ బాలురు, టెన్నీకాయిట్‌ బాల, బాలికలు, క్రికెట్‌ బాల, బాలికలు, సూపర్‌ సెవన్‌ క్రికెట్‌ బాల, బాలికలు, బాస్కెట్‌బాల్‌ బాలుర టోర్నీలను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అండర్‌-14 బీచ్‌ వాలీబాల్‌, చదరంగం బాల, బాలికలు, అండర్‌-17 రగ్బీ, టెన్నీకాయిట్‌ బీచ్‌ వాలీబాల్‌ బాల, బాలికల టోర్నీలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి, ఎక్కడైతే ఏయే క్రీడలకు ప్రాచుర్యం ఉందో, అక్కడి వసతుల ఆధారంగా టోర్నీలను కేటాయిస్తామని వారు ఈ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.