close

గురువారం, జనవరి 23, 2020

ప్రధానాంశాలు

బోడకుంటి, వినయ్‌కి కేబినెట్‌ హోదా

మండలి, శాసనసభ చీఫ్‌ విప్‌లుగా నియామకం

దాస్యం వినయ్‌భాస్కర్‌                        బోడకుంటి వెంకటేశ్వర్లు

ఈనాడు, వరంగల్‌, కాశీబుగ్గ, న్యూస్‌టుడే: వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా నియమితులయ్యారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో గతంలో గండ్ర వెంకటరమణారెడ్డి చీఫ్‌ విప్‌గా పని చేశారు. ఈ పదవిని అందుకున్న వారిలో వినయ్‌ రెండోవారు. 2005 మేలో తెరాసలో చేరిన ఈయన పార్టీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2005 నుంచి 2009 వరకు కార్పొరేటర్‌గా ఉన్నారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. 2010లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లోనూ వరంగల్‌ పశ్చిమ నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు.

పార్లమెంటు కార్యదర్శిగా..

రాష్ట్రం ఆవిర్భవించిన 2014లో తెరాస అధికారంలోకి వచ్చాక పార్లమెంటు కార్యదర్శి పదవులకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. వినయ్‌భాస్కర్‌కు ఈ పదవిని ఇచ్చారు. అనంతరం కోర్టు తీర్పు కారణంగా దాన్ని కోల్పోయారు. తాజాగా చీఫ్‌విప్‌గా నియమితులు కావడంతో శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. క్యాంపు కార్యాలయం కార్యకర్తలు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.

ఎంపీపీ నుంచి...

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన శాసనమండలి విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు చీఫ్‌ విప్‌గా నియామకమయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు శనివారం ఖరారు చేశారు. ఉమ్మడి జిల్లాలో బచ్చన్నపేట ఎంపీపీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత సంగెం నుంచి జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొంది జడ్పీ ఛైర్మన్‌గా పని చేశారు. ఆనక తెదేపా నుంచి వరంగల్‌ ఎంపీగా గెలుపొందారు. శాసనమండలి సభ్యుడిగా కూడా తెదేపా నుంచి ఎన్నికై ఫ్లోర్‌ లీడర్‌గా పని చేశారు. తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెదేపా నుంచి తెరాసలో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి, మండలి విప్‌గా చేశారు. తాజాగా శాసనసభ చీఫ్‌ విప్‌గా నియమించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ పార్టీకి విధేయుడిగా ఉంటూ పూర్తి స్థాయిలో సేవలందిస్తున్నందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తనకు మండలి చీఫ్‌ విప్‌గా అవకాశం కల్పించారన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.