close

సోమవారం, అక్టోబర్ 21, 2019

ప్రధానాంశాలు

హోరాహోరీగా సెపక్‌తక్రా పోటీలు

ఫైనల్‌కు చేరిన జట్ల క్రీడాకారులతో కోచ్‌లు, సెపక్‌తక్రా అసోసియేషన్‌ సభ్యులు

వరిగొండ(తోటపల్లిగూడూరు), న్యూస్‌టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలంలోని వరిగొండలో శాస్త్ర విద్యాసంస్థల ఆవరణలో జరుగుతున్న సెపక్‌తక్రా రాష్ట్రస్థాయి పోటీలు రెండో రోజు ఆదివారం హోరాహోరీగా జరిగాయి. సబ్‌జూనియర్‌ బాలుర విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌లో కర్నూలు- అనంతపురం, కడప- కృష్ణ్ణా, శ్రీకాకుళం- విశాఖ, నెల్లూరు- పశ్చిమగోదావరి జట్లు పోటీపడగా సెమీఫైనల్లో కడప- కర్నూలు, శ్రీకాకుళం- నెల్లూరు జట్లు తలపడ్డాయి. శ్రీకాకుళం-కర్నూలు జట్లు ఫైనల్‌కు చేరాయి. జూనియర్‌ బాలుర విభాగంలో సెమీఫైనల్‌లో కర్నూలు- పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి -కృష్ణా జిల్లాలు తలపడనున్నాయి. వీరిలో విజేతలుగా నిలిచిన వారు సోమవారం ఫైనల్స్‌లో పాల్గొంటారు. సబ్‌జూనియర్‌ బాలికల విభాగంలో పశ్చిమగోదావరి- తూర్పుగోదావరి, నెల్లూరు- అనంతపురం జట్లు సెమీఫైనల్‌లో తలపడగా నెల్లూరు- పశ్చిమగోదావరి జట్లు ఫైనల్స్‌కు చేరాయి. జూనియర్స్‌ విభాగంలో కృష్ణా- కర్నూలు, నెల్లూరు- పశ్చిమగోదావరి జట్లు సెమీఫైనల్‌లో పోటీపడగా కర్నూలు- పశ్చిమగోదావరి జట్లు ఫైనల్‌కు చేరాయి. చివరి దశ పోటీలు సోమవారం జరగనున్నాయి. కార్యక్రమంలో పోటీల నిర్వాహకులు, ఆయా జిల్లాల నుంచి వచ్చిన శిక్షకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.