close

శుక్రవారం, అక్టోబర్ 18, 2019

ప్రధానాంశాలు

వినూత్న ఆవిష్కరణలకు విద్యార్థులు కృషి చేయాలి..

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: వినూత్న ఆవిష్కరణలకు విద్యార్థులు కృషి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కోరారు. ఖమ్మం నగరంలోని హార్వెస్ట్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఆదివారం రాత్రి 27వ రాష్ట్రస్థాయి బాలల సైన్‌్్స కాంగ్రెస్‌ను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థుల్లో ఉన్న జిజ్ఞాసను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కొత్త ఆలోచనలతో విద్యార్థులు ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి అనేక మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రాజెక్టులను ప్రదర్శించారని, వీటిలో 13 మాత్రమే ఎంపిక చేస్తారన్నారు. విజయం, పరాజయం ముఖ్యం కాదు పోటీల్లో పాల్గొనటమే ప్రధానమన్నారు. ప్రతిష్ఠాత్మకంగా జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు హార్వెస్ట్‌ పబ్లిక్‌ స్కూల్‌ వేదిక కావటం ఎంతో సంతోషకరమన్నారు. జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు చదవటం ఎంతో ముఖ్యమన్నారు. పాఠ్యేతర పుస్తకాలను చదివేందుకు విద్యార్థులు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పుస్తక పఠనం ద్వారానే మెదళ్లు చురుగ్గా పనిచేస్తాయని చెప్పారు. చరవాణిని వదిలివేయాలని విద్యార్థులకు సూచించారు. ప్రశ్నించటం ద్వారానే సైన్స్‌ ఆవిష్కరణలు సాధ్యమని, అందుకు బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ వేదిక అవుతుందని కర్ణన్‌ అన్నారు. జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ పిల్లల్లో సృజనాత్మకత పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. దేశానికి అవసరమైన శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యార్థులు ముందుండాలన్నారు. దేశానికి, సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్‌ఏసీ జాతీయ సలహాదారు డాక్టర్‌ గీతా స్వామినాథన్‌ మాట్లాడుతూ సరికొత్త భారతావని కోసం విద్యార్థులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. టీఎస్‌ కాస్ట్‌ మెంబర్‌ సెక్రటరీ రవికుమార్‌ పులి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తీసుకున్న చొరవ ఎంతో ప్రశంసనీయమన్నారు. ఇక్కడి పాఠశాల యాజమాన్యం వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు, అధికారులకు, విద్యార్థులకు మంచి ఏర్పాట్లు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ డాక్టర్‌ జి.పాపాలాల్‌, జిల్లా విద్యాశాఖాధికారి పి.మదన్‌మోహన్‌, హార్వెస్ట్‌ పబ్లిక్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ రవిమారుత్‌, ప్రిన్సిపల్‌ ఆర్‌.పార్వతిరెడ్డి, స్టేట్‌ అకడమిక్‌ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ కాశీనాథ్‌, ఉపమేయర్‌ బత్తుల మురళి, స్థానిక కార్పొరేటర్‌ బిక్కసాని ప్రశాంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి పువ్వాడ బెలూన్లను ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అతిథులకు విద్యార్థులు గులాబి పూలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు హార్వెస్ట్‌ పబ్లిక్‌ స్కూల్‌ యాజమాన్యం జ్ఞాపికను బహూకరించింది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.