close

ఆదివారం, అక్టోబర్ 20, 2019

ప్రధానాంశాలు

టీటీ ఛాంపియన్‌ జగదీష్‌కృష్ణ
రెండు విభాగాల్లో రన్నరప్‌గా నిలిచిన హాసిని
పురుషుల టైటిల్‌ అందుకుంటున్న జగదీష్‌కృష్ణ
 

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: జిల్లా టీటీ సంఘం ఆధ్వర్యంలో మూడురోజులుగా జరిగిన రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ ర్యాంకింగ్‌ పోటీల్లో గుంటూరు జిల్లాకు చెందిన జగదీష్‌కృష్ణ మరోసారి పురుషుల ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. గత ఐదేళ్ల నుంచి వరుసగా ఈ యువకుడు ర్యాంకింగ్‌ పోటీల్లో జోరు కొనసాగిస్తున్నాడు. ఫైనల్లో ప్రత్యర్థులు మారుతున్నా విజయం మాత్రం జగదీష్‌ను వరిస్తోంది. ఆదివారం డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్‌ పోటీల్లో జగదీష్‌కృష్ణ విజయవాడకు చెందిన పాండే (4-0)పై గెలిచాడు. మహిళల విభాగం టైటిల్‌ విజయవాడకు చెందిన శైలు నూర్‌భాష సొంతం చేసుకుంది. ఫైనల్లో అనంతపురానికి చెందిన నాగశ్రావణిపై నెగ్గింది. యూత్‌ బాలుర విభాగంలో సూర్యతేజ విజేతగా నిలిచాడు. ఫైనల్లో సాయిస్వరూప్‌పై 3-0 తేడాతో అలవోకగా నెగ్గాడు. బాలికల విభాగం టైటిల్‌ను శైలునూర్‌బాష నిలబెట్టుకుంది. ఫైనల్లో అనంతకు చెందిన హాసినిపై వరుస సెట్లలో గెలుపొందింది. జూనియర్‌ బాలుర విభాగంలో అక్షిత్‌ విజేతగా నిలిచాడు. రన్నరప్‌గా నితీష్‌వర్మ నిలిచాడు. బాలికల విభాగంలో దోహదవతి విజేతగా, రన్నరప్‌గా హాసిని నిలిచారు. సబ్‌జూనియర్‌ బాలుర విభాగంలో కార్తికేయ టైటిల్‌ అందుకోగా...రెండోస్థానంలో ప్రభాత్‌సాయి నిలిచాడు. బాలికల విభాగంలో ఆశ్రిత టైటిల్‌ అందుకుంది. రన్నరప్‌గా వైష్ణవి సూర్య నిలిచింది. క్యాడెట్‌ బాలుర విభాగం టైటిల్‌ను సమ్యాద్‌ కైవసం చేసుకోగా.. రన్నరప్‌గా విజాధర్‌ నిలిచాడు. బాలికల విభాగంలో సన్హిత విజేతగా.. సుస్మిత ద్వితీయస్థానంలో నిలిచింది. ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర టీటీ సంఘం కార్యదర్శి సుల్తాన్‌, గేట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల డైరెక్టర్‌ రఘునాథరెడ్డి, సప్తగిరి కర్ఫూర పరిశ్రమ జీఎం హనీఫ్‌, జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ అక్బర్‌సాహెబ్‌, కార్యదర్శి కేశవరెడ్డి, ఉపాధ్యక్షులు మురళీధర్‌రావు, పాండురంగయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి అరుణ్‌కుమార్‌, సభ్యులు మేడా రాజేష్‌, శ్రీనివాసరెడ్డి, సూర్యనారాయణ తదితరులు హాజరై విజేతలకు నగదు, ట్రోఫీలు అందజేశారు.

అనంతలో జాతీయ ర్యాంకింగ్‌ పోటీలు

వచ్చే ఏడాది అనంతపురంలో టీటీ జాతీయ ర్యాంకింగ్‌ పోటీలు నిర్వహించాలన్న ఆలోచన ఉందని రాష్ట్ర టీటీ సంఘం కార్యదర్శి సుల్తాన్‌ తెలిపారు. జిల్లా వరుసగా 19 పర్యాయాలు రాష్ట్రస్థాయి పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. ఒకసారి జాతీయ ర్యాంకింగ్‌ పోటీలు నిర్వహిస్తే దేశంలోని అన్ని రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఆదివారం ఇండోర్‌ స్టేడియంలో జరిగిన టీటీ ర్యాంకింగ్‌ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల విశాఖలో సబ్‌జూనియర్‌, జూనియర్‌ విభాగం పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ పోటీల ద్వారా మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన వారిని జపాన్‌లో జరిగే శిక్షణ శిబిరానికి పంపిస్తామన్నారు. ఈ క్రీడాకారులకు అయ్యే ఖర్చులు రోటరీక్లబ్‌ భరిస్తుందని వివరించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.