close

బుధవారం, అక్టోబర్ 23, 2019

ప్రధానాంశాలు

రచయితలు.. సమాజ నిర్దేశకులు
ఘనంగా పుస్తకావిష్కరణ సభ
పుస్తకావిష్కరణ చేస్తున్న అతిథులు
 

అనంత సాంస్కృతికం, న్యూస్‌టుడే: సమాజంలోని అసమానతలను ప్రశ్నించేవారే సాహితీవేత్తలని ఎంపీ తలారి రంగయ్య పేర్కొన్నారు. అనంతపురంలోని ప్రముఖ సాహితీసంస్థ విమలాశాంతి సాహిత్య సాంఘిక సేవాసమితి వ్యవస్థాపకులు శాంతినారాయణ రచించిన ‘నాలుగు అస్తిత్వాలు - నాలుగు నవలికలు, నాగలకట్ట సుద్దులు-2వ భాగము’ పుస్తకాల ఆవిష్కరణోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఆదివారం రుద్రంపేట బైపాస్‌రోడ్డులోని వాల్మీకి భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా ఎంపీతోపాటు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత విజయభాస్కర్‌, కేంద్రసాహిత్య అకాడమి జనరల్‌ కౌన్సిల్‌ సభ్యులు ఆచార్య రాచపాళం చంద్రశేఖరరెడ్డి, ఆచార్య మేడిపల్లి రవికుమార్‌, అశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో రచయితల సంఖ్య పెగడం సంతోషించదగ్గ విషయమన్నారు. కానీ చదివేవారి సంఖ్య తగ్గిపోవడం బాధాకరమన్నారు. పుస్తకాల పఠనంతోనే మంచి వక్తలు, మంచి వ్యక్తులుగా తయారవుతారన్నారు. అనంతరం పలువురు మాట్లాడుతూ నిబద్ధత కలిగిన సాహిత్యం సమాజానికి నిలువుటద్దమన్నారు. సమాజంలోని కల్మశాన్ని, విషసంస్కృతిని తన రచనల ద్వారా కడిగేయడం రచయిత కర్తవ్యమన్నారు. రచయితలు సమాజ నిర్దేశకులన్నారు. సమాజాన్ని ప్రశ్నించేందుకు రచనలు, రచయితలు ఇంకా రావాలన్నారు. అలాగే ‘వన మహోత్సవం’ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సాహితీవేత్తల పేరున మొక్కలు నాటారు. అనంతరం ‘సూత రంగస్థలి- వర్తమానావశ్యకత, అస్తిత్వ సాహిత్య ప్రాముఖ్యత’ అంశంపై చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు బండినారాయణస్వామి, చిదంబరరెడ్డి, వెంకటేశులు, మల్లెల నరసింహమూర్తి, రాజారామ్‌, ప్రగతి, దీవెన, కేశవరెడ్డి, నానీల నాగేంద్ర, అశ్వర్థరెడ్డి, షహనాజ్‌బేగం, నబిరసూల్‌, షరీఫ్‌, రియాజుద్దీన్‌, వెంకటేశులు, చంద్రశేఖర్‌, కేరే జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.