close

బుధవారం, అక్టోబర్ 23, 2019

ప్రధానాంశాలు

ఫుట్‌బాల్‌ శిక్షకులకు పునశ్చరణ తరగతులు

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: జిల్లాలోని వివిధ మండలాల్లో ఫుట్‌బాల్‌ శిక్షకులుగా పనిచేస్తున్న వారికి అనంత క్రీడాగ్రామంలో పునశ్చరణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లలిగా క్లబ్‌కు చెందిన జోష్‌ ఆంటోనియో, భారత్‌ లలిగా క్లబ్‌ సభ్యులు కాబ్రెరా, సౌల్‌ వాజ్‌క్యూజ్‌ హాజరై ఫుట్‌బాల్‌ ఆటలో ఆధునిక శిక్షణపై సలహాలు ఇచ్చారు. ఆర్డీటీ గ్రాస్‌రూట్‌ సమన్వయకర్త వంశీ, అకాడమీ సమన్వయకర్త దాదాఖలందర్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 34 మంది శిక్షకులు హాజరయ్యారు. అన్ని మండలాల్లో ఫుట్‌బాల్‌ క్రీడను అభివృద్ధి చేయాలని ఆర్డీటీ నిర్ణయించిందన్నారు. అనంతరం శిక్షకులకు యోగ్యత పత్రాలు ప్రదానం చేశారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.