close

బుధవారం, అక్టోబర్ 23, 2019

ప్రధానాంశాలు

పంచాయతీ ఉప ఎన్నికలకు సన్నద్ధం

ఉమ్మడి జిల్లాలో 3 సర్పంచి, 12 ఉప సర్పంచి, 54 వార్డులు ఖాళీ
నేడు ఓటరు ముసాయిదా జాబితా ప్రదర్శన
17 నుంచి 21 వరకు అభ్యంతరాల స్వీకరణ
25న పరిష్కారానికి చర్యలు
30న తుది జాబితా ప్రచురణ
న్యూస్‌టుడే, పాలమూరు

రాజోలి మండలంలోని మాన్‌దొడ్డి గ్రామం

గ్రామ పంచాయతీల్లో ఉప ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఖాళీగా ఉన్న సర్పంచి, ఉప సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నిక నిర్వహించడం కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లా పంచాయతీ అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఆదివారం డీపీవో కార్యాలయాల్లో సిబ్బంది ఓటరు జాబితాలపై కసరత్తు చేశారు. ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఉమ్మడి జిల్లాలో మూడు గ్రామ పంచాయతీ సర్పంచి స్థానాలకు, 54 వార్డు సభ్యులు, 12 ఉప సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరగబోయే గ్రామ పంచాయతీల్లో అన్ని వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రచురించనున్నారు. కేవలం వార్డుకు మాత్రమే ఎన్నికలు జరిగే వాటిలో ఆ వార్డులో ఉన్న ఓటర్ల జాబితాలను మాత్రమే పంచాయతీలలో ప్రదర్శించనున్నారు. ఈ నెల 16వ తేదీ సోమవారం నుంచి 30వ తేదీ వరకు పంచాయతీ ఎన్నికల కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. అనంతరం వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికల ప్రకటన వెలువడి, రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
షెడ్యూల్‌ వివరాలు ఇలా...
గ్రామ పంచాయతీల్లో ఖాళీగా సర్పంచి, వార్డు స్థానాలకు ఎన్నికలను నిర్వహించబోయే వాటిలో ఈ నెల 16వ తేదీన ఓటరు జాబితా ప్రదర్శిస్తారు. 17 నుంచి 21వ తేదీ వరకు జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. 18న జిల్లా స్థాయిలో డీపీవో, 19న మండలంలో ఎంపీడీవో అధ్యక్షతన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. ఓటరు జాబితాలపై వచ్చిన అభ్యంతరాలను 25వ తేదీన పరిష్కరిస్తారు.
అనంతరం 30న తుది జాబితా ప్రకటించి, అదే ఓటరు జాబితాతో పోలింగ్‌ నిర్వహిస్తారు.

మూడు సర్పంచి స్థానాలకు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు గ్రామ పంచాయతీలకు సర్పంచులు లేరు. అనివార్య కారణాల వల్ల ఈ పంచాయతీ స్థానాలు ఖాళీలు ఏర్పడ్డాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల మండలం గోప్లాపూర్‌ సర్పంచి, వనపర్తి జిల్లాలోని పాన్‌గల్‌ మండలం వెంగళాయపల్లి సర్పంచి మరణించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కొల్లాపూర్‌ మండలం మాచినేనిపల్లి సర్పంచి ఎంపీపీగా ఎన్నిక కావడంతో సర్పంచి పదవికి రాజీనామా చేశారు. ఈ కారణాల వల్ల ఈ మూడు పంచాయతీల సర్పంచి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు పలువురు వార్డు సభ్యులు రాజీనామా చేయడం, చనిపోవడం, మరికొందరు ఎంపీటీసీలుగా ఎన్నిక కావడంతో ఆయా స్థానాలు ఖాళీలు ఏర్పడ్డాయి.

ఖాళీగా ఉన్న ఉప సర్పంచి స్థానాలివే..
* జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి మండలం మాన్‌దొడ్డి, అయిజ మండలం కుర్వపల్లి, గట్టు మండలం తుమ్మళ్లపల్లి, ఇటిక్యాల మండలం షాబాద్‌ గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచి స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
* మహబూబ్‌నగర్‌ జిల్లాలో అడ్డాకుల మండలం ఇమ్మాయిపల్లి తండా, జడ్చర్ల మండలంలో  ఆలూరు, వల్లూరు గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచి పదవులు ఖాళీగా ఉన్నాయి.
* నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పెద్ద కొత్తపల్లి మండలం యాపట్ల, కొల్లాపూర్‌ మండలంలోని కుడికిల్ల పంచాయతీలు ఉన్నాయి.
* వనపర్తి జిల్లాలో రేేవల్లి మండలం నాగాపూర్‌, పాన్‌గల్‌ మండలంలోని దొండాయిపల్లి పంచాయతీలు ఉన్నాయి.
* నారాయణపేట జిల్లాలో ధన్వాడ మండలం కార్లగడ్డ తండా పంచాయతీ ఉప సర్పంచి  ఎన్నిక జరగనుంది.

మహబూబ్‌నగర్‌ : పంచాయతీ ఓటరు జాబితా వివరాలను ప్రొజెక్టర్‌

సహాయంతో పరిశీలిస్తున్న డీపీవో కార్యాలయ సిబ్బంది

త్వరలోనే ఎన్నికలు : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో సర్పంచి, వార్డులు, ఉప సర్పంచి స్థానాలు ఖాళీగా ఉన్న వాటికి ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఓటరు జాబితా ప్రక్రియ కొనసాగుతుంది. త్వరలోనే ఆయా పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తాం.

- వెంకటేశ్వర్లు, డీపీవో, మహబూబ్‌నగర్‌

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.